ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Guvvala Balraju : వచ్చేది బీఆర్ఎస్సే.. ప్రతీకారం తీర్చుకుంటాం : కేటీఆర్ వార్నింగ్

ABN, First Publish Date - 2023-11-12T12:12:45+05:30

రాష్ట్రంలో మూడో సారి అధికారం చేపట్టేది బీఆర్ఎస్(BRS) సర్కారే అని.. తాము వచ్చాక కాంగ్రెస్ పార్టీపై ప్రతీకారం తీర్చుకుంటామని మంత్రి కేటీఆర్(KTR) వార్నింగ్ ఇచ్చారు.

హైదరాబాద్: రాష్ట్రంలో మూడో సారి అధికారం చేపట్టేది బీఆర్ఎస్(BRS) సర్కారే అని.. తాము వచ్చాక కాంగ్రెస్ పార్టీపై ప్రతీకారం తీర్చుకుంటామని మంత్రి కేటీఆర్(KTR) వార్నింగ్ ఇచ్చారు. అచ్చంపేటలో రాళ్ల దాడిలో గాయపడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వాల బాలరాజు(Guvvala Balraju)ను అపోలో ఆసుపత్రికి(Appolo Hospital) తరలించారు. ఆయనను మంత్రి కేటీఆర్ ఇవాళ పరిమర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. బాలరాజు ఆరోగ్య పరిస్థితిన డాక్టర్లకు అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ కు వస్తున్న ప్రజాదరణ ఓర్వలేకే తమపై దాడులకు తెగబడుతున్నారని బాలరాజు కుటుంబ సభ్యులు ఆరోపించారు.

కేటీఆర్ మాట్లాడుతూ.. "ఉద్యమ కాలంలో ఎన్నో దాడుల్ని తట్టుకుని బాలరాజు నిలబడ్డారు. ఆయన ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన చెందవద్దు. ప్రజాప్రతినిధులకు సెక్యూరిటీ పెంచాలని డీజీపీని కోరుతాం. అచ్చంపేట కాంగ్రెస్ అభ్యర్థి వంవీకృష్ణ తన అనుచరులతో ఆయనపై దాడి చేశారు. రాష్ట్రంలో దాడుల సంస్కృతి మంచిదికాదు. బాలరాజు సతీమణిని కూడా కించపరిచేలా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారు. వచ్చేది మా ప్రభుత్వమే. దాడులకు పాల్పడిన వారిపై రివేంజ్ తీర్చుకుంటాం. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలి. దళితబిడ్డపై కాంగ్రెస్ దాడులు చేస్తే.. ఆ పార్టీ అణగారిన వర్గాలకు ఇస్తున్న గౌరవమేంటీ" అని అన్నారు.


శనివారం అర్థరాత్రి బీఆర్ఎస్, కాంగ్రెస్‌(BRS, Congress) కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు(MLA Guvwala Balaraju) తన కారులో డబ్బులు తరలిస్తున్నారంటూ కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆరోపిస్తూ.. ఆందోళనకు దిగారు. అలాగే ఎమ్మెల్యే కారును అడ్డుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లదాడి చేసుకున్నారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఇరుపార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. గువ్వలకు గాయలవ్వడంతో జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు.

Updated Date - 2023-11-12T13:05:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising