ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

KTR: పంట బీమా, రైతు బీమాకు తేడా కూడా రేవంత్‌కు తెలియదు

ABN, Publish Date - Dec 16 , 2023 | 06:23 PM

KTR: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు మాజీ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో సీఎం పీసీసీ చీఫ్‌గా మాట్లాడుతున్నారని.. ఇది గాంధీ భవన్ కాదనే విషయం ఆయన గుర్తుపెట్టుకోవాలని కేటీఆర్ సూచించారు. రేవంత్‌కు పంట బీమా, రైతు బీమాకు తెలియదని ఆరోపించారు. రేవంత్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయినందుకు సిగ్గుపడుతున్నామని కేటీఆర్ అన్నారు.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు మాజీ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో సీఎం పీసీసీ చీఫ్‌గా మాట్లాడుతున్నారని.. ఇది గాంధీ భవన్ కాదనే విషయం ఆయన గుర్తుపెట్టుకోవాలని కేటీఆర్ సూచించారు. రేవంత్‌కు పంట బీమా, రైతు బీమాకు తెలియదని ఆరోపించారు. రేవంత్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయినందుకు సిగ్గుపడుతున్నామని కేటీఆర్ అన్నారు. ఇసుక మాఫియా అంటూ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని.. 2014-2023 వరకు ఇసుకపై రూ.5వేల కోట్లు వచ్చాయని.. కాంగ్రెస్ హయాంలోనే ఇసుక మాఫియా ఉండేదని.. అందుకే అప్పట్లో రూ.4 కోట్ల ఆదాయం కూడా రాలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో ఇసుక ఆదాయం ఎటుపోయిందో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించిన తర్వాత బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడేందుకు ప్రయత్నించారు. కేటీఆర్‌ను మాట్లాడాలని స్పీకర్ సూచించగా.. హరీష్‌రావు ప్రసంగించేందుకు ప్రయత్నాలు చేశారు. తెలంగాణ రాకముందు, జవహర్‌లాల్ నెహ్రూ తరం నాటి రాజకీయాలను ప్రస్తావించడంతో అధికార పార్టీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొలడంతో స్పీకర్ సభను వచ్చే బుధవారానికి వాయిదా వేశారు.


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 16 , 2023 | 06:23 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising