ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

KTR: మంత్రి కేటీఆర్ సంచలన కామెంట్స్.. తలరాతలు మార్చే ఎన్నికలు ఇవి..

ABN, First Publish Date - 2023-10-10T13:19:38+05:30

నవంబరులో జరుగబోయేది ఎమ్మెల్యే ఎన్నికలు కాదని, ఇవి రాష్ట్ర తలరాత మార్చే ఎన్నికలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌(Minister KTR) వ్యాఖ్యానించారు.

తొర్రూరు(మహబుబాబాద్): నవంబరులో జరుగబోయేది ఎమ్మెల్యే ఎన్నికలు కాదని, ఇవి రాష్ట్ర తలరాత మార్చే ఎన్నికలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌(Minister KTR) వ్యాఖ్యానించారు. తొర్రూరు మండలం వెల్లికట్టె గ్రామ శివారులో సోమవారం ఏర్పాటు చేసిన సంక్షేమ సమావేశ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్‌ హాజరై మాట్లాడారు. కేసీఆర్‌ మూడోసారి సీఎం అయితే మన పార్టీకి జాతీయస్థాయిలో గుర్తింపు వస్తుందన్నారు. ఇవి మన ఖ్యాతి పెంచి ఢిల్లీని శాసించే ఎన్నికలని అన్నారు. ఎన్నికల వేళ సీఎం కేసీఆర్‌కు అచ్చొచ్చిన సంఖ్య ఆరు.. నవంబరు 30 ఎన్నిక... డిసెంబరు 3న ఫలితాలు రెండింటిలో మూడు ఉంది.. రెండు కలిపి కేసీఆర్‌కు అచ్చొచ్చిన సంఖ్య 6.. మరోసారి సీఎం కేసీఆర్‌ సర్కారే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చాక, రాకముందు జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం ఎలా ఉందో ప్రజలు విశ్లేషణ చేసుకోవాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ 24గంటల ఉచిత కరెంట్‌ ఇస్తుంటే.. ఓ కాంగ్రెస్‌ ఎంపీ ఎక్కడా లేదంటూ మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ వాళ్లు వచ్చి విద్యుత్‌ వైర్లు పట్టుకోవాలని సూచించారు. అప్పుడే రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోతుందని అన్నారు. పాలకుర్తిలో అభివృద్ధితోనే ఎర్రబెల్లి దయాకర్‌రావు గెలుపు ఖాయమైందని, ఇకా జూలు తీయడమేననని, లక్ష ఓట్లతో గెలిపించాలని కేటీఆర్‌ అన్నారు.

Updated Date - 2023-10-10T13:19:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising