ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Lumpy skin disease: మళ్లీ కలకలం రేపుతున్న లంపి స్కిన్ వ్యాధి.. భయాందోళనలో రైతులు

ABN, First Publish Date - 2023-02-16T17:37:13+05:30

పశువుల్లో లంపి స్కిన్ వ్యాధి (Lumpy skin disease) కలకలం రేపుతోంది. రెండురోజుల క్రితం లంపి స్కిన్తో ఓ ఆవు (COW) మృతి చెందింది. ఈ వ్యాధి వందలాది ఆవులకు సోకడంతో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి: పశువుల్లో లంపి స్కిన్ వ్యాధి (Lumpy skin disease) కలకలం రేపుతోంది. రెండురోజుల క్రితం లంపి స్కిన్తో ఓ ఆవు (COW) మృతి చెందింది. ఈ వ్యాధి వందలాది ఆవులకు సోకడంతో పాడి రైతులు (Dairy farmers) ఆందోళన చెందుతున్నారు. లంపిస్కిన్‌ వ్యాధి పశువుల్లో వ్యాపిస్తుంది. ముఖ్యంగా తెల్ల ఆవులకు ఈ వ్యాధి సోకుతోంది. దోమలు, ఈగలు, తేళ్లు, ఇతర కీటకాలు కుట్టడం వల్ల ఇది పశువులకు వ్యాపిస్తోంది. గతంలో పలు రాష్ట్రాల్లో ఈ వ్యాధి వల్ల వందలాది పశువులు చనిపోయాయి. ఈ వ్యాధి ఇతర జిల్లాలో విస్తరించకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు.

వ్యాధి లక్షణాలు.. జాగ్రత్తలు

లంపి స్కిన్‌ సోకిన పశువుల్లో నోటి, ముక్కుల నుంచి ద్రవాలు, శరీరమంతా పొక్కులు వస్తాయి. వ్యాధి సోకిన పశువుల్లో పాల ఉత్పత్తి తగ్గుతుంది. తినడానికి ఇబ్బంది పడతాయి. అధిక జ్వరం వస్తే మరణాలు సంభవించే అవకాశం ఉంది. అయితే ఎక్కువగా వ్యాధి సోకిన జంతువుల్లో మరణాలు తక్కువగానే ఉంటాయి. రైతులంతా పశువుల చావిడి శుభ్రంగా ఉంచుకోవాలి. క్రిమికీటకాలు, దోమలు, ఈగలు రాకుండా జాగ్రత్త పడాలి. పశువుల గొట్టాలను, పరిసరాల్లో క్రిమిసంహారక మందుల పిచికారీ చేయాలి. లంపిస్కిన్‌ వ్యాధి వచ్చిన పశువుల చర్మంపై పొక్కులు, నోట్లో బొబ్బర్లు, తీవ్రమైన జ్వరం వస్తుంది. ఈ వ్యాధి సోకిన జంతువులు మరో జంతువుతో సన్నిహితంగా ఉండకుండా జాగ్రత్త వహించాలి.

వ్యాధి సోకిందని తెలిస్తే మంద నుంచి వేరుచేయాలి. ఈ వ్యాధిని నివారించడానికి గోట్‌ పాక్స్‌ వ్యాక్సినేషన్‌ వేయించాలి. లంపిస్కిన్‌ వ్యాధి గురించి పాడి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. ఇది ప్రాణాంతకమైనది కాదని.. అయినప్పటికి వ్యాధి సోకితే పశువులకు నష్టం కాబట్టి ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు. వ్యాధి సోకిన పశువులను మంద నుంచి దూరం చేయాలని చెబుతున్నారు. ఆ పశువులు తిన్న గడ్డి ఇతర పశువులకు వేయోద్దని అధికారలు సూచిస్తున్నారు. వ్యాధితో బాధపడుతున్న పవశుల పాలు తాగొద్దని హెచ్చరిస్తున్నారు.

లంపి స్కిన్‌ లక్షణాలివే..

పశువులకు తీవ్రమైన జ్వరం

కంటి నుంచి నీరు కారడం

చర్మంపై పెద్దపెద్ద గడ్డలు

తీవ్రమైన ఒళ్లు నొప్పులు

చర్మమంతా పొలుసులుగా మారడం

పశువు మేత తినదు. పాలివ్వదు

Updated Date - 2023-02-16T17:37:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising