ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MLC Kavitha: ‘తెలంగాణలో శాంతియుతం.. దేశంలో విచిత్ర పరిస్థితులు’

ABN, First Publish Date - 2023-02-18T13:44:44+05:30

మహాశివరాత్రి సందర్భంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అలంపూర్ ఆలయాలను దర్శించుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జోగులాంబ గద్వాల: మహాశివరాత్రి (MahaShivratri)సందర్భంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) అలంపూర్ ఆలయాలను దర్శించుకున్నారు. జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయం (Jogulamba Bala Brahmeswara Swamy Temple)లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్సీ (BRS MLC) మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ (Telangana State) లో శాంతియుత వాతావరణం ఉంటే.. దేశవ్యాప్తంగా విచిత్రమైన పరిస్థితులు, విపరీతమైన ధోరణిని అవలంబిస్తున్న తీరును చూస్తున్నామన్నారు. తెలంగాణ పథకాలు (Telangana schemes) కావాలని ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh), కర్ణాటక (Karnataka), మహారాష్ట్ర (Maharashtra) ప్రజలు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ పథకాలు దేశవ్యాప్తంగా రావాలనే ఉద్దేశంతోనే భారత రాష్ట్ర సమితి (BRS) నిర్మించుకున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR)పై అమ్మవారు ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకున్నట్లు ఎమ్మెల్సీ చెప్పారు.

తెలంగాణ మాదిరి.. దేశవ్యాప్త వాతావరణం రావాలని బీఆర్ఎస్ (BRS) పార్టీ కృషి చేస్తుందన్నారు. సుభిక్షంగా రాష్ట్రం ఉండాలంటే.. ప్రతి గ్రామంలో చెరువులు బాగుండాలన్నారు. చెక్ డాముల ద్వారా రెండు కిలోమీటర్ల మేర నిల్వ ఉండేటట్లు పాలమూరు (Palamuru) లో చేశామని వెల్లడించారు. ఒకప్పుడు పాలమూరు నుంచి వలసలు వెళ్లేవాళ్ళమని... ఇప్పుడు ఇదే పాలమూరుకు ఇతర రాష్ట్రాల నుండి వలసలు వస్తున్నారని చెప్పుకొచ్చారు. కేసీఆర్ పాదయాత్ర (KCR Padayatra) వల్ల అప్పటి సమస్యలను గుర్తించి ఆర్డీఎస్ (RDS) శాశ్వత పరిష్కారం కొరకు తుమ్మిళ్ల లిఫ్టు ద్వారా సాగునీటిని పరిష్కరించుకున్నామన్నారు. కృష్ణ తుంగభద్ర కలయిక ప్రాంతమైన నడిగడ్డలో తాగునీటికి కటకట ఉండేదన్నారు. నేటి మిషన్ భగీరథ (Mission Bhagiratha) ద్వారా చివరి గ్రామాలకు తాగునీరు పుష్కలంగా అందుతుందని తెలిపారు. ప్రసాద్ స్కీం (Prasad Scheme) ద్వారా రూ.50 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) పేర్కొన్నాయి.

కవిత వెంట ఎమ్మెల్యేలు అబ్రహం, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్, జడ్పీ చైర్ పర్సన్ సరిత ఉన్నారు.

Updated Date - 2023-02-18T13:46:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising