మోడల్ రైల్వేస్టేషన్లుగా గద్వాల, జోగుళాంబ హాల్ట్
ABN , First Publish Date - 2023-06-19T23:28:13+05:30 IST
రైల్వే ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అం దించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఎంపికచేసిన మోడల్ రైల్వేస్టేషన్ల జాబితాలో జిల్లాలోని గద్వాల, జోగుళాంబ హాల్ట్ స్టేషన్లు ఎంపికయ్యాయి.
గద్వాల అర్బన్, జూన్ 19 : రైల్వే ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అం దించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఎంపికచేసిన మోడల్ రైల్వేస్టేషన్ల జాబితాలో జిల్లాలోని గద్వాల, జోగుళాంబ హాల్ట్ స్టేషన్లు ఎంపికయ్యాయి. దక్షిణ కాశీగా పిలు చుకునే అలంపూర్ జోగుళాంబ బాలబ్రహ్మేశరస్వామి ఆలయాల సందర్శనకు వచ్చే ప్రయాణికులకు మోడల్ స్టేషన్ ద్వారా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి. దీంతో పాటు, ఇప్పటికే జంక్షన్‌గా ఉన్న గద్వాల రైల్వేస్టేషన్‌ను మోడల్ రైల్వేస్టేషన్‌గా ఎం పిక చేయడంతో ఈ స్టేషన్ రూపురేఖలు మారనున్నాయి. కాగా, రెండు రేల్వేస్టేషన్ల అభివృద్ధికి సంబంధించి ఏ కార్యక్రమాలు చేపట్టనున్నారో తమకు ఇంకా సమాచారం అందలేదని స్థానిక రైల్వే అధికారులు తెలిపారు.