ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Minister KTR: డబ్బులు చాలా మందికి ఉండవచ్చు కానీ..

ABN, First Publish Date - 2023-06-08T15:02:20+05:30

సీఎం కేసీఆర్ (CM KCR) ప్రభుత్వంలో వెయ్యి గురుకులాలు పెట్టామని.. ఆరు లక్షల మంది విద్యార్థులకు అత్యుత్తమమైన విద్య అందించి.. వారు పెద్ద వ్యవస్థల్లో సీట్లు సంపాదిస్తే తనకు ఎంతో ఆనందంగా ఉంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్‌నగర్: పిల్లలమర్రి రోడ్డులో ఉన్న బాలికల ఐటిఐ కళాశాలలో సెయింట్ ఫౌండేషన్, శాంతా నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మాణానికి భూమి పూజ, అలాగే శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్ల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్ (KTR), శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ డబ్బులు చాలా మంది దగ్గర ఉండవచ్చునని.. కానీ మంచి చేయాలని ఆలోచన రావటం గొప్పని.. అలాంటిది మోహన్ రెడ్డి ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ పెట్టడం గొప్ప విషయమన్నారు.

సీఎం కేసీఆర్ (CM KCR) ప్రభుత్వంలో వెయ్యి గురుకులాలు పెట్టామని.. ఆరు లక్షల మంది విద్యార్థులకు అత్యుత్తమమైన విద్య అందించి.. వారు పెద్ద వ్యవస్థల్లో సీట్లు సంపాదిస్తే తనకు ఎంతో ఆనందంగా ఉంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. పరిశ్రమల కల్పనకు ఆ రోజుల్లో రెడ్ టేప్ ఉంటే.. నేడు రెడ్ కార్పెట్ పరుస్తున్నామన్నారు. మనం ఇపుడు నైపుణ్యాలను అంది పుచ్చుకుంటే భవిష్యత్ యువతదేనన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని, ఉపాధి అవకాశాలు అందేలా ఉంటాయన్నారు. అప్పుడు పారిశ్రామిక వేత్తలు ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేసిన దుస్థితి వాస్తవం కాదా.. ఇపుడు ఎలాంటి పరిస్థితి ఉంది.. మరి ఈ అంశాలను వేడుకలా చేసుకోవద్దా అని మంత్రి అన్నారు. ఒకప్పుడు మహబూబ్‌నగర్ అంటే మైగ్రేషన్.. ఇపుడు ఇరిగేషన్ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

హైదరాబాద్ మారింది వాస్తవం కాదా?.. 24 గంటల కరెంటు ఉండటం వాస్తవం కాదా?.. ఈ తొమ్మిదేళ్లలో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం?.. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ రావటం వాస్తవం కాదా అని మంత్రి కేటీఆర్ అన్నారు. 30 శాతంగా ఉన్న ప్రసూతి.. ఇపుడు 60 శాతానికి వచ్చిందన్నారు. రియల్ ఎస్టేట్.. అప్పుడు ఎంత ఉండే.. ఇపుడు ఎకరా ఎంత ఉందో తెల్వదా.. ఇపుడు కేవలం స్కిల్ డెవలప్‌మెంట్‌పై దృష్టి సారించాలని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-06-08T15:02:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising