ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Minister Niranjan Reddy: ఏ రాష్ట్రం కూడా తెలంగాణ అభివృద్ధితో పోటీ పడలేదు

ABN, First Publish Date - 2023-08-12T17:13:22+05:30

నేడు దేశంలో ఏ రాష్ట్రం కూడా తెలంగాణ అభివృద్ధి(Development of Telangana)తో పోటీ పడలేదని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి(Niranjan Reddy) అన్నారు. శనివారం నాడు వనపర్తి జిల్లా గోపాల్ పేట్ మండలంలో పర్యటించారు.

వనపర్తి: నేడు దేశంలో ఏ రాష్ట్రం కూడా తెలంగాణ అభివృద్ధి(Development of Telangana)తో పోటీ పడలేదని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి(Niranjan Reddy) అన్నారు. శనివారం నాడు వనపర్తి జిల్లా గోపాల్ పేట్ మండలంలో పర్యటించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి(
Palamuru Rangareddy Uplift Project) ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) పర్యావరణ అనుమతులు సాధించిన సంధర్భంగా ఏదుల రిజర్వాయర్ దగ్గర రైతలతో కలిసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి రైతులు, ప్రజలు భారీ ఎత్తున హాజరయ్యారు.అలాగే వనపర్తి నుంచి ఏదుల రిజర్వాయర్ వరకు 300 బైకులతో యువకుల భారీ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ... ‘‘తెలంగాణ వేయేళ్ల భవిష్యత్‌ను సీఎం కేసీఆర్ కలగన్నారు.. ఆయన గులాబీ జెండా ఎగరేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రం తెచ్చిన కేసీఆర్‌కు ప్రజలు అధికారం ఇచ్చారు. ఒకనాడు నీళ్లకు గతిలేని స్థితి .. పశువులకు గడ్డి లేని పరిస్థితి. నేడు తెలంగాణలో పండే పంటలు కొనలేమని కేంద్రం చేతులెత్తేసే పరిస్థితి. ప్రతి ఒక్కరికీ సంక్షేమం, ప్రతి కుటుంబానికి పథకం. తెలంగాణ రావడం ఖాయం .. పాలమూరు రంగారెడ్డితో నీళ్లిస్తాం అని 2009లోనే కేసీఆర్ స్పష్టంగా చెప్పారు’’ అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు.


ఉమ్మడి పాలమూరు జిల్లాలో 10 లక్షల ఎకరాలు ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో 2.50 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినట్లు మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు.‘‘కృష్ణా నీటి వాటా తేల్చకుండా కేంద్రం 9 ఏళ్లుగా నానుస్తోంది. కేంద్రం అడ్డంకులు అధిగమించి పర్యావరణ అనుమతులు సాధించాం. ఎవరూ కలగనలేదు .. ఇక్కడ ప్రాజెక్టు వస్తదని, ఇప్పుడు లక్షల ఎకరాలకు నీళ్లొస్తాయి. మొత్తం 90 టీఎంసీల నీటి సామర్థ్యం గల రిజర్వాయర్లు నిర్మించుకున్నాం. భవిష్యత్‌లో రెండేళ్లు వానలు రాకున్నా వ్యవసాయానికి ఢోకా ఉండదు. నీళ్లిచ్చిన కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. 60 ఏళ్లు గత పాలకులు, నాయకులు పాలమూరును ఎడారి చేస్తే కేసీఆర్ పచ్చదనంతో నింపారు. నీళ్లు, కరెంటు, విద్య, వైద్యం అన్ని రంగాలను కేసీఆర్ అభివృద్ధి చేశారు. లోకమున్నంత వరకు వ్యవసాయం ఉంటుంది. అందుకే కేసీఆర్ వ్యవసాయానికి ప్రాధాన్యం ఇచ్చి రైతులకు అండగా నిలుస్తున్నారు’’ అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-08-12T17:13:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising