Yennam Srinivas Reddy: తెలంగాణ ప్రజల ఆకాంక్ష తీరాలంటే కాంగ్రెస్ సీఎం రావాలి
ABN, First Publish Date - 2023-09-27T16:46:12+05:30
సామాన్య కార్యకర్తగా పనిచేయటం కోసమే కాంగ్రెస్లో చేరాను. దుర్మార్గపు పాలనను అంతమొందించాలంటే ఏకతాటిపైకి రావాలి. పాలమూరులో అభివృద్ధి మాటున అరాచకం జరుగుతోంది. సిద్ధాంతాలు వేరైనా ఏకమై విధ్వంసకపాలన
మహబూబ్నగర్: తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు సఫలం కావాలంటే కాంగ్రెస్ సీఎం కావాలని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) ఆకాంక్షించారు. యెన్నం శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘సామాన్య కార్యకర్తగా పనిచేయటం కోసమే కాంగ్రెస్లో చేరాను. దుర్మార్గపు పాలనను అంతమొందించాలంటే ఏకతాటిపైకి రావాలి. పాలమూరులో అభివృద్ధి మాటున అరాచకం జరుగుతోంది. సిద్ధాంతాలు వేరైనా ఏకమై విధ్వంసకపాలన అంతమొందిస్తాం. రాష్ట్రమంతా నిశ్శబ్ద విప్లవం కొనసాగుతోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారంటీ స్కీంలు కాంగ్రెస్ అమలు చేస్తుంది. పాలమూరు ప్రజలకు సంక్షేమం అందాలంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే రావాలి. టికెట్ ఎవరికి వచ్చినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసమే పని చేస్తా.’’ అని వెల్లడించారు.
Updated Date - 2023-09-27T16:48:11+05:30 IST