Niranjan Reddy: ఉచిత విద్యుత్‌పై రేవంత్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి కౌంటర్
ABN, First Publish Date - 2023-07-11T16:45:15+05:30
ఉచిత విద్యుత్ అవసరంలేదన్న రేవంత్ వ్యాఖ్యలు తెలంగాణ రైతాంగాన్ని అవమానపరిచినట్టుగా ఉన్నాయి. ప్రజా క్షేత్రంలో ఇలాంటి నేతలకు శిక్ష తప్పదు. కరెంటు ఇవ్వడం దండగ అన్నట్లుగా మాట్లాడటం అవివేకం. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిని.. ఆ పార్టీలను తెలంగాణలో బొందపెట్టాలి. తెలంగాణలో వ్యవసాయాన్ని పండగ చేసిన ఘనత బీఆర్‌ఎస్‌దే.
వనపర్తి: పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై (Revanth Reddy) వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) మండిపడ్డారు. మంత్రి మీడియాతో మాట్లాడారు ‘‘తెలంగాణ పచ్చబడుతుంటే.. వీరి కడుపుల్లో మంటలు లేపుతుంది. ఉచిత విద్యుత్ అవసరంలేదన్న రేవంత్ వ్యాఖ్యలు తెలంగాణ రైతాంగాన్ని అవమానపరిచినట్టుగా ఉన్నాయి. ప్రజా క్షేత్రంలో ఇలాంటి నేతలకు శిక్ష తప్పదు. కరెంటు ఇవ్వడం దండగ అన్నట్లుగా మాట్లాడటం అవివేకం. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిని.. ఆ పార్టీలను తెలంగాణలో బొందపెట్టాలి. తెలంగాణలో వ్యవసాయాన్ని పండగ చేసిన ఘనత బీఆర్‌ఎస్‌దే. నేడు దేశానికే అన్నపూర్ణగా తెలంగాణ మారిందంటే.. ఆ ఘనత సీఎం కేసీఆర్‌దే. ఆనాడు వ్యవసాయాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేసి రాష్ట్రాన్ని కరవు కాటకాల జిల్లాలుగా మార్చింది. రైతులు గౌరవంగా బ్రతుకుతుంటే రేవంత్ ఓర్వలేకపోతున్నారు. ఉచిత కరెంటు.. పెట్టుబడిగా రైతు బంధు ఇవ్వడం వల్లే ఒక్క ఎకరం కూడా బీడు లేకుండా సేద్యం జరుగుతుంది.’’ అని మంత్రి పేర్కొన్నారు.
Updated Date - 2023-07-11T16:45:15+05:30 IST