ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Maoist: మోసాలకు పాల్పడుతున్న దళారులను నిలదీయండి

ABN, First Publish Date - 2023-12-06T12:53:44+05:30

పత్తి, వరి కొనుగోలులో మోసాలకు పాల్పడుతున్న దళారులు, మిల్లర్లను రైతులు నిలదీయాలని మావోయిస్టు (జేఎండబ్ల్యూపీ)

- మావోయిస్టు డివిజన్‌ కార్యదర్శి వెంకటేశ్‌

ఏటూరునాగారం(ములుగు): పత్తి, వరి కొనుగోలులో మోసాలకు పాల్పడుతున్న దళారులు, మిల్లర్లను రైతులు నిలదీయాలని మావోయిస్టు (జేఎండబ్ల్యూపీ) డివిజన్‌ కమిటీ కంకణాల రాజిరెడ్డి అలియాస్‌ వెంకటేశ్‌ పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన వెలువరించారు. రైతు లు వరి పంటను మార్కెట్‌కు తీసుకెళ్తే తేమ, ఇసుక, తాలు పేరుతో కోత విధిస్తూ దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. మిల్లర్లు ఇష్టారాజ్యంగా కోత విధిస్తు న్నారని పేర్కొన్నారు. సీసీఐ మార్కెట్‌కు తీసుకెళ్లిన పత్తిని ఒకరిద్దరు రైతుల ను ఎంపిక చేసి మిగతా వారిని గాలికి వదిలేస్తోందని, దీన్ని ఆసరాగా చేసుకున్న కొనుగోలుదారులు, పత్తి మిల్లుల యజమానులు సిండికేట్‌గా మారి ప్రభుత్వం నిర్ణయించిన ధరకంటే తక్కువకు కొంటున్నారని పేర్కొన్నారు. హమాలీ ఖర్చుల కింద క్వింటాకు రూ. 20 అదనంగా వసూలు చేస్తున్నారని, ఈ దోపిడీని మార్చుకోకపోతే రైతులు తిరగబడి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. పాలక వర్గాలు ఇవేవీ పట్టించుకోకుండా వ్యాపారుల వద్ద కమీషన్లు తీసుకుంటూ చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇకనైనా దళారులు, మిల్లర్లు రైతులను మోసం చేసే పద్ధతిని మార్చు కోవాలని, లేనిపక్షంలో ఆగ్రహానికి గురికాకతప్పదని హెచ్చరించారు.

Updated Date - 2023-12-06T12:53:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising