ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mayor Parijata చేవెళ్ల లోక్‏సభ స్థానం నుంచి పారిజాత..!

ABN, Publish Date - Dec 27 , 2023 | 10:35 AM

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌ మేయర్‌ చిగిరింత పారిజాతా(Mayor Chigirintha Parijata) నర్సింహారెడ్డి.. చేవెళ్ల ఎంపీ టికెట్‌పై గురి పెట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మహేశ్వరం అసెంబ్లీ టికెట్‌ దాదాపుగా ఆమెకే ఖరారు చేస్తూ పార్టీ అధిష్ఠానం జాబితా సైతం సిద్ధం చేసినప్పటికీ, చివరి నిమిషంలో కేఎల్ఆర్‌(KLR) పేరు ఖరారైంది.

- చివరి క్షణంలో చేజారిన మహేశ్వరం ఎమ్మెల్యే టికెట్‌

- ఎమ్మెల్సీ లేదా ఎంపీ టికెట్‌ కోసం పట్టు?

సరూర్‌నగర్‌(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌ మేయర్‌ చిగిరింత పారిజాతా(Mayor Chigirintha Parijata) నర్సింహారెడ్డి.. చేవెళ్ల ఎంపీ టికెట్‌పై గురి పెట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మహేశ్వరం అసెంబ్లీ టికెట్‌ దాదాపుగా ఆమెకే ఖరారు చేస్తూ పార్టీ అధిష్ఠానం జాబితా సైతం సిద్ధం చేసినప్పటికీ, చివరి నిమిషంలో కేఎల్ఆర్‌(KLR) పేరు ఖరారైంది. దీంతో అప్పట్లో ఇండిపెండెంట్‌గానైనా సరే పోటీ చేయాలని భావించి నామినేషన్‌ దాఖలు చేశారు. పార్టీ పెద్దలు రంగంలోకి దిగి ఆమెను బుజ్జగించారు. స్వయంగా కేసీ వేణుగోపాల్‌(KC Venugopal) సైతం తమతో మాట్లాడారని, రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చారని అప్పట్లో పారిజాతారెడ్డి ప్రకటించారు. ఆ హామీ మేరకే అలక వీడి నామినేషన్‌ విత్‌ డ్రా చేసుకుని, కేఎల్లార్‌కు మద్దతుగా ప్రచారం చేశారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి కేఎల్లార్‌ మూడో స్థానానికి పరిమితమయ్యారు.

ఎంపీ టికెట్‌ కోసం ప్రయత్నాలు

మహేశ్వరం ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తే తాను కచ్చితంగా గెలిచేదానినని, చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చడం మైనస్‌ పాయింట్‌గా మారి పార్టీ ఓడిపోయిందని పారిజాతారెడ్డి పార్టీ నేతలతో జరిపే సంభాషణల్లో పేర్కొంటున్నారు. నెల రోజుల ముందుగానే కేఎల్లార్‌ పేరు ఖరారు చేసి ఉంటే గెలిపించుకునేవారమని, కానీ, చివరి క్షణంలో ఆయనను తెరపైకి తేవడంతో స్థానిక ఓటర్లు బీజేపీ, బీఆర్‌ఎస్‌ వైపు డైవర్ట్‌ అయ్యారని, అదే పార్టీకి నష్టం కలిగించిందని ఆమె అంటున్నారు. కాగా మహేశ్వరం అసెంబ్లీ టికెట్‌ మిస్సయిన తనకు చేవెళ్ల(Chevella) ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించాలంటూ ఆమె పార్టీ అధిష్ఠానం పెద్దలను కలుస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు ఢిల్లీకి, ఓసారి తమిళనాడుకు, మరోసారి బెంగళూరుకు వెళ్లి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించే పలువురు నేతలను ఆమె కలిసినట్టు తెలిసింది. చేవెళ్ల పరిధిలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఉండడం పార్టీకి కలిసి వచ్చే అంశాలని ఆమె భావిస్తున్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో పార్టీ పటిష్టత కోసం తాను చేసిన కృషిని గుర్తించి, పార్టీ పెద్దలు చేవెళ్ల పార్లమెంటు స్థానానికి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని ఆమె కోరుతున్నారు. ఆ దిశలో ఆమె తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఒకవేళ ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఎంపీ టికెట్‌ అవసరం లేదని ఆమె పార్టీ పెద్దల వద్ద వ్యాఖ్యానించినట్టు తెలిసింది. మరి ఆమె ప్రయత్నం ఫలిస్తుందా.. లేక మహేశ్వరం టికెట్‌లాగే ఊరించి ఉసూరుమనిపిస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే.

Updated Date - Dec 27 , 2023 | 10:35 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising