ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

GHMC: మేయర్ విజయలక్ష్మి సీరియస్... కారణం ఇదే...!

ABN, First Publish Date - 2023-03-08T16:31:20+05:30

అక్రమాలను అరికట్టేందుకంటూ తీసుకొచ్చిన సంస్కరణలే మరిన్ని అక్రమాలకు కారణమయ్యాయి. పారదర్శక సేవలందించేందుకు ప్రవేశపెట్టిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: అక్రమాలను అరికట్టేందుకంటూ తీసుకొచ్చిన సంస్కరణలే మరిన్ని అక్రమాలకు కారణమయ్యాయి. పారదర్శక సేవలందించేందుకు ప్రవేశపెట్టిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానం.. అక్రమార్కుల పనిని మరింత సులువు చేసింది. పౌరసేవలకు సంబంధించి జీహెచ్‌ఎంసీ నూతనంగా అమల్లోకి తెచ్చిన విధానాలు.. అవినీతిపరులకు అవకాశంగా మారాయి. సాఫ్ట్‌వేర్‌ (Software)లో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకొని పెద్ద ఎత్తున అర్హతలేని ఆస్తులను మదింపు చేశారు. దీంతోపాటు.. పారదర్శక పౌరసేవలు, నకిలీ జనన/మరణ ధ్రువీకరణ పత్రాల జారీని నియంత్రించేందుకు వినియోగంలోకి తెచ్చిన కొత్త సాఫ్ట్‌వేర్‌నూ అక్రమార్కులు దుర్వినియోగం చేశారు. జీహెచ్‌ఎంసీలో నమోదుకాని వారికీ వేల సంఖ్యలో సర్టిఫికెట్లు జారీ చేశారు. నకిలీ జనన/మరణ ధ్రువీకరణ పత్రాలపై జీహెచ్‌ఎంసీ (GHMC) మేయర్‌ విజయలక్ష్మి (Mayor Vijayalakshmi), అధికారులతో అత్యవసర భేటీ అయ్యారు.నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంపై మేయర్ మండిపడ్డారు. సంబంధిత అధికారులపై మేయర్‌ వేటు వేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే బల్దియా కమిషనర్‌కు విజిలెన్స్‌ అధికారుల నివేదిక సమర్పించారు. విజిలెన్స్‌ నివేదికలో పలువురు ఇంటి దొంగల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. నూతన సాంకేతిక విధానాన్ని అందుబాటులోకి తెచ్చినా, లొసుగులను ఆధారంగా కొందరు దళారులు, మీ సేవా నిర్వాహకులు ఇష్టం వచ్చినట్లు జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు.

ఆలస్యంగా మేల్కొన్న జీహెచ్‌ఎంసీ

నకిలీ జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీపై జీహెచ్‌ఎంసీ ఆలస్యంగా మేల్కొంది. అక్రమార్కుల అరెస్ట్‌తో అప్రమత్తమైన ఉన్నతాధికారులు సంస్థలో అంతర్గత పరిశీలనకు ఆదేశించారు. సర్కిళ్ల వారీగా జారీ చేసిన సర్టిఫికెట్లను సిబ్బంది పరిశీలించారు. తప్పుడు పత్రాలతో అప్‌లోడ్‌ చేసినట్లు గుర్తించారు. గ్రేటర్‌లోని 30 సర్కిళ్లలో ఈ తతంగం జరిగినట్లు గుర్తించి, 27 వేలకు పైగా నకిలీ సర్టిఫికెట్లను రద్దు చేస్తున్నట్టు జీహెచ్‌ఎంసీ ప్రకటించింది. మొత్తం వ్యవహారంపై విజిలెన్స్‌ విచారణకు కమిషనర్‌ డీఎస్‌ లోకే్‌షకుమార్‌ ఆదేశించినట్టు తెలిసింది.

Updated Date - 2023-03-08T16:31:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising