Etela Rajender: ఓటమి భయంతోనే కేసీఆర్ కామారెడ్డికి వెళ్లిపోయారు
ABN, First Publish Date - 2023-08-30T16:44:49+05:30
గజ్వేల్ ప్రజలు కేసీఆర్‌ను నమ్మి ఓటేస్తే.. ప్రజల భూములు గుంజుకుంటున్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని అన్నారు. కేసీఆర్‌ని గజ్వేల్ ప్రజలు గెలిపించవద్దు అని కోరుతున్నా. గజ్వేల్ నుంచి నేను పోటీ చేస్తానని గతంలోనే చెప్పా. గజ్వేల్ ప్రజలు ఈసారి కేసీఆర్‌కు ఓటు వేయం అంటున్నారు.
సంగారెడ్డి: బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక్కటేనని ప్రజలు గమనించాలని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ (Etela Rajender) అన్నారు. సంగారెడ్డి బీజేపీ జిల్లా కార్యాలయంలో ఈటల మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంపై (Kcr Government) మండిపడ్డారు. ‘‘గజ్వేల్ ప్రజలు కేసీఆర్‌ను నమ్మి ఓటేస్తే.. ప్రజల భూములు గుంజుకుంటున్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని అన్నారు. కేసీఆర్‌ని గజ్వేల్ ప్రజలు గెలిపించవద్దు అని కోరుతున్నా. గజ్వేల్ నుంచి నేను పోటీ చేస్తానని గతంలోనే చెప్పా. గజ్వేల్ ప్రజలు ఈసారి కేసీఆర్‌కు ఓటు వేయం అంటున్నారు. గజ్వేల్ నుంచి ఒడిపోతామన్న భయంతో కేసీఆర్ కామారెడ్డికి వెళ్లిపోయారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు 30 నుంచి 40 శాతం మందికి టికెట్ రాదని ప్రచారం జరిగింది. కానీ భయపడి ఒకే సారి 115 మంది టికెట్లు ప్రకటించారు. దశాబ్ది ఉత్సవాల పేరుతో నేరుగా కలెక్టర్లే డబ్బులు డ్రా చేసి దావత్‌లు చేశారు. కేసీఆర్ ఇచ్చే హామీలు బోలెడు. బిల్లులు రాక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 19 మందిలో 12 మంది బీఆర్ఎస్ (BRS) లోకి గుంజుకున్నారు. కుక్కల్లాగా మొరిగే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను పిల్లిల్లా చేశామని ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అంటున్నారు. కాంగ్రెస్ వాళ్లను ఏమనకండి వాళ్లు మనవాళ్లే అని ఇంకో ఎమ్మెల్యే అంటున్నారు. వాళ్లు మన కోవర్టులే. మనమే గెలిపించి మన పార్టీలోకి తీసుకోస్తాం అంటున్నారు. కుటుంబ పాలన వద్దంటే బీజేపీకి ఓటేయండి. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించితేనే రేపు మనకి శుభోదయం. బీజేపీకి గ్రాఫ్ బాగా ఉందని 119 నియోజకవర్గాల్లో పర్యటించిన మా ఎమ్మెల్యేలు చెప్పారు. సమన్వయం ఉంటే ఇంకా ముందుకు వెళ్లొచ్చు అని చెప్పారు.’’ అని ఈటల వ్యాఖ్యానించారు.
Updated Date - 2023-08-30T16:44:49+05:30 IST