Siddipet Dist.: మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడంపై కేంద్ర కమిటీ కీలక నివేదిక..
ABN, First Publish Date - 2023-11-03T12:42:50+05:30
సిద్దిపేట జిల్లా: మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడంపై కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో కీలకమైన అంశాలను పేర్కొంది. మొత్తం 21 అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరితే కేవలం 11 అంశాలపైనే వివరణ ఇచ్చిందని కమిటీ తెలిపింది.
సిద్దిపేట జిల్లా: మేడిగడ్డ ప్రాజెక్టు (Medigadda Project) కుంగడంపై కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ (Central Dam Safety Authority Committee) నివేదిక (Report) ఇచ్చింది. ఆ నివేదికలో కీలకమైన అంశాలను పేర్కొంది. మొత్తం 21 అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరితే కేవలం 11 అంశాలపైనే వివరణ ఇచ్చిందని కమిటీ తెలిపింది. పిల్లర్లు కుంగిపోవడానికి బ్యారేజి పునాదులకింద ఇసుక కొట్టుకుపోవడంవల్లే కుంగిపోయిందని ఆ నివేదికలో పేర్కొంది. ఫౌండేషన్ మెటీరియల్ పటిష్టత, సామర్థ్యం తక్కువగా ఉందని కమిటీ తెలిపింది. బ్యారేజ్ లోడు వల్ల ఎక్కువగా ఎగువన ఉన్న కాంక్రిట్ కూడా తొలగిపోయిందని, బ్యారేజ్‌ను పునరుద్దరించే వరకు చేపట్టాల్సిన చర్యలు కూడా కమిటీ సూచించింది. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడానికి ప్రధాన కారణం.. ప్లానింగ్, డిజైన్, క్వాలటీ కంట్రోల్, ఆపరేషన్ మెయింటినెన్స్.. మొత్తం ఈ నాలుగు విషయాల్లో వైఫల్యం చెందడంవల్లే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయిందని కేంద్ర కమిటీ స్పష్టం చేసింది.
Updated Date - 2023-11-03T12:42:51+05:30 IST