ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Collector Sarath : ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలి

ABN, First Publish Date - 2023-10-09T16:07:22+05:30

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్(Sangareddy District Collector Sarath) వ్యాఖ్యానించారు.

సంగారెడ్డి: ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్(Sangareddy District Collector Sarath) వ్యాఖ్యానించారు. సోమవారం నాడు జిల్లా కలెక్టరేట్‌లో మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 1594 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. పోటీ చేయాలి అనుకున్న అభ్యర్థులు కొత్త బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. ఈ రోజు నుంచి కరపత్రాలు ముద్రించే వారు తప్పనిసరిగా లెక్క చెప్పాలి. దీని పర్యవేక్షణ కోసం ప్రతి నియోజకర్గస్థాయిలో ఒక స్క్వాడ్‌ని ఏర్పాటు చేశాం. జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా కోసం మొత్తం 9 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని సంగారెడ్డి కలెక్టర్ శరత్ పేర్కొన్నారు. అనంతరం ఎస్పీ రమణ కుమార్(SP Ramana Kumar) మాట్లాడుతూ.. లైసెన్స్ తుపాకీలు ఉన్నవారు స్థానిక పోలీస్ స్టేషన్‌లో సరెండర్ చేయాలి. 2,3 రోజుల్లో తుపాకీలు అప్పజెప్పాలి. సభలు, సమావేశాలు పోలీసుల అనుమతి లేనిదే నిర్వహించకూడదు. తాయిలాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవు. ప్రభుత్వ సంస్థలపై పార్టీల ప్రచారానికి సంబంధించిన విషయాలు రాయకుడదు. ఇప్పటి వరకు 379 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించాం. ఏదైనా ఫిర్యాదు కోసం 1950ని సంప్రదించాలని ఎస్పీ రమణ కుమార్ తెలిపారు.

Updated Date - 2023-10-09T17:42:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising