ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Farmers Protest: గజ్వేల్‌లో సాగునీటి కోసం రైతుల మెరుపు సమ్మె

ABN, First Publish Date - 2023-04-26T12:58:28+05:30

మెదక్: ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) సొంత నియోజకవర్గం గజ్వేల్‌ (Ghazwal)లో రైతులు రోడ్డెక్కారు. కొండపాక మండలం, వెలుకట్ట చౌరస్తావద్ద సాగునీటి రైతులు ధర్నా చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెదక్: ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) సొంత నియోజకవర్గం గజ్వేల్‌ (Ghazwal)లో రైతులు రోడ్డెక్కారు. కొండపాక మండలం, వెలుకట్ట చౌరస్తావద్ద సాగునీటి రైతులు ధర్నా చేపట్టారు. రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. బంధారం, బంధారం దర్గా, అక్కిరెడ్డిపల్లి గ్రామాలకు చెందిన రైతులు బుద్దేడువద్ద ఆందోళన నిర్వహించారు. తపస్‌పల్లి రిజర్వాయర్ నుంచి నీరు అందిస్తామని ప్రభుత్వం ఇస్తున్న హామీ.. ఇంత వరకు అమలు కాలేదని రైతులు ఆరోపించారు. మల్లన్నసాగర్ నుంచి నీరు అందిస్తామని ఎన్నోసార్లు చెప్పారని, కానీ కాలువ నిర్మాణం కూడా చేపట్టలేదని అన్నారు.

రైతుల మెరుపు సమ్మెతో పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. రైతులను ఎక్కడికక్కడ అడ్డుకుని మందుగానే అదుపులోకి తీసుకున్నారు. దీంతో రైతుల అరెస్టును నిరసిస్తూ పలువురు రైతులు మూడవ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేపట్టారు. రైతులు ధర్నా చేస్తుండగా.. అధికార పార్టీ నేతలు గజ్వేలులో ఫ్లీనరీ సందర్బంగా జండా ఎగురవేశారే తప్పా.. రైతుల సమస్యలు తెలుసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-04-26T12:58:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising