ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Siddipet: ఇంటింటికి మొక్కల పంపిణీ.. పాల్గొన్న మంత్రి హరీష్

ABN, First Publish Date - 2023-07-30T09:55:49+05:30

సిద్దిపేట జిల్లా: మున్సిపల్ సంఘం ఆధ్వర్యంలో ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హరీష్‌రావు పాల్గొని.. జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

సిద్దిపేట జిల్లా: మున్సిపల్ సంఘం ఆధ్వర్యంలో ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హరీష్‌రావు (Minister Harish Rao) పాల్గొని.. జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ‘చెట్టు - బొట్టు’గా పేరు పెట్టారని, ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం చెట్ల పెంపకం ఎంతో అవసరం అన్నారు. తెలంగాణలో చెట్ల పెంపకం ద్వారా 7.4 శాతం గ్రీన్ కవర్ పెంపొందించిన ఒకే ఒక రాష్ట్రం మనదని అన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఆస్పత్రులు కట్టడం కాదు... వ్యాధులు రాకుండా కాపాడుకోవడం కూడా అవసరమన్నారు. ప్రజలకు స్వచ్చమైన గాలి అందిచలి... వారి ఊపిరితిత్తులను కాపాడాలని అన్నారు.

చెట్లు పెంచడం ద్వారా అన్ని రకాలుగా ఆరోగ్య అభివృధి జరుగుతుందని మంత్రి హరష్‌రావు అన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఉపరితల స్వచ్ఛ గోదావరి తరగు నీరు అందిస్తున్నామన్నారు. వ్యవసాయంలో రసాయనాలు తగ్గించి స్వచ్చమైన గోదావరి నీళ్లతో పండించిన పంట అందించాలని, హరిత హరంలో భాగంగా మొక్కల పెంపకం మొదలు పెట్టామన్నారు. మున్సిపల్ కౌన్సిలర్లు, సిబ్బంది ప్రతిరోజూ ఉదయం వార్డులలో చెత్త ఏరడం ఒక మంచి పరిణామమని, కౌన్సిలర్లు చెత్త ఏరడంతో ప్రజల్లో అవగాహన కలుగుతుందన్నారు. మున్సిపల్ సిబ్బంది, కార్మికులు మంచిగా పని చేస్తున్నారని, జాతీయస్థాయిలో సిటిజన్ ఫీడ్‌బ్యాక్‌లో మనం రెండో స్థానంలో ఉన్నామన్నారు. మొక్కలు పంచడమే కాదు.. నాటి పెంచే విధంగా కౌన్సిలర్లు, సిబ్బంది ప్రజలను ప్రోత్సహించాలని మంత్రి హరీష్‌రావు సూచించారు.

Updated Date - 2023-07-30T09:55:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising