Harish Rao: మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం ఒక అద్భుత ఘట్టం
ABN, First Publish Date - 2023-07-05T11:33:12+05:30
కొమురవెళ్లి శ్రీ మల్లికార్జున స్వామి వారిని మంత్రి హరీష్‌రావు దర్శించుకున్నారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రూ.12 కోట్ల వ్యయంతో క్యూలైన్ల కాంప్లెక్స్ నిర్మాణానికి మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి శంకుస్థాపన చేశారు.
సిద్దిపేట జిల్లా: కొమురవెళ్లి శ్రీ మల్లికార్జున స్వామి వారిని (Komuravelli Mallikarjuna swamy Temple) మంత్రి హరీష్‌రావు (Minister Harish Rao) దర్శించుకున్నారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రూ.12 కోట్ల వ్యయంతో క్యూలైన్ల కాంప్లెక్స్ నిర్మాణానికి మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి (MLA Muttireddy Yadagiri Reddy) శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) చొరవతో ఆలయం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. రూ.12 కోట్ల వ్యయంతో క్యూ లైన్ కాంప్లెక్స్ నిర్మాణం చేపడుతున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక రూ.36 కోట్లతో ఆలయంలో అభివృద్ధి పనులు చేశామన్నారు. గత కళ్యాణంలో హామీ ఇచ్చినట్టు స్వామి వారికి బంగారు కిరీటం, మీసాలు, వెండి దర్వాజాలు చేయించినట్లు చెప్పారు. మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం ఒక అద్భుతమైన ఘట్టమన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా మల్లన్న స్వామి దయతో మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ పూర్తి చేసి కాళేశ్వరం జలాలతో నింపామని మంత్రి అన్నారు.
మల్లన్న సాగర్ నీటితోనే సీఎం కేసీఆర్ స్వామివారికి అభిషేకం చేశారని తెలిపారు. జాతీయ రహదారి నుంచి ఆలయం వరకు డబుల్ రోడ్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. వంద గదుల సత్రం త్వరలోనే అందుబాటులోకి వస్తుందని చెప్పారు. గుట్టపై దాతల సహకారంతో భక్తుల సౌకర్యార్థం గదులను నిర్మిస్తున్నామన్నారు. కొమురవెల్లి దేవాలయం దినదిన అభివృద్ధి చెందుతోందని తెలిపారు. ప్లాస్టిక్ రహితంగా మల్లన్న ఆలయం ఉండాలని చర్యలు తీసుకుంటున్నామన్నారు. గతంలో ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువ ఉండేవని.. ఇప్పుడు ప్రతీ యేటా దాదాపు రూ.18 కోట్ల ఆదాయం వస్తోందని అన్నారు. మల్లన్న స్వామి ఆశీస్సులతో ఈ ప్రాంతం సుభీక్షంగా ఉందన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో కాలంతో నిమిత్తం లేకుండా, వర్షాలతో అవసరం లేకుండా మల్లన్న సాగర్ ద్వారా రైతులు రెండు పంటలు పండిస్తున్నారని మంత్రి హరీష్‌రావు వెల్లడించారు.
Updated Date - 2023-07-05T11:33:12+05:30 IST