ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Minister Talasani: సీఎం కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడు

ABN, First Publish Date - 2023-09-13T13:12:02+05:30

ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడని.. ఈ పనికిరాని చెత్త ప్రతిపక్ష పార్టీలు కళ్ళు ఉండి చూడలేని పరిస్థితుల్లో ఉన్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శలు గుప్పించారు.

సిద్దిపేట: ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) విజన్ ఉన్న నాయకుడని.. ఈ పనికిరాని చెత్త ప్రతిపక్ష పార్టీలు కళ్ళు ఉండి చూడలేని పరిస్థితుల్లో ఉన్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) విమర్శలు గుప్పించారు. బుధవారం మర్కుక్ మండలం కొండపోచమ్మ సాగర్‌లో 14 లక్షల 35 వేల చేప పిల్లలను మంత్రి వదిలారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ... గత ప్రభుత్వాలు మత్స్సకారులు ఉన్నారనే విషయం మరిచిందని.. 100 శాతం ఉచ్చితంగా చేప పిల్లలను పంపిణీ చేసేది తెలంగాణ రాష్ట్రమే అని అన్నారు. మటన్, చికెన్ కంటే చేపలతోనే ఆరోగ్యం బాగుంటుందని వైద్యులు చెపుతున్నారన్నారు. చేపలు పట్టుకునే వారికి 4 లక్షల ఐడీ కార్డులు.. వేయి కోట్ల రూపాయలతో వాహనాలు, జాలరులకు రైన్ కోర్టులను ప్రభుత్వం అందించిందన్నారు. 18 సంవత్సరాలు నిండిన వారందరికీ మెంబర్షిప్ ఉండాలనేది ప్రభుత్వం లక్ష్యమని.. కొంత మంది మూర్కులకు కళ్ళు కనిపించవని మండిపడ్డారు. కొండ పోచమ్మలో నీళ్లు లేవు ఉట్టిగానే కట్టారని కొంతమంది ప్రతిపక్ష నేతలు మాట్లాడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-09-13T13:12:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising