ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS News: సెలూన్‌ షాపులో దళితులకు క్షవరం చేసేందుకు నిరాకరణ.. కారణం తెలిస్తే..

ABN, First Publish Date - 2023-07-06T11:30:52+05:30

సమాజం మారుతున్నప్పటికీ కులాల విషయం అంతరాలు మాత్రం మారటం లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట: సమాజం మారుతున్నప్పటికీ కులాల విషయం అంతరాలు మాత్రం మారటం లేదు. పట్టణాల కంటే పల్లెల్లో ఈ వివక్ష ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దళితులను తక్కువ స్థాయిలో చూస్తూ వారి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్న పరిస్థితులు పలు చోటు కనిపిస్తూనే ఉంటాయి. తాజాగా కులవివక్షతో దళితులకు సెలూన్ షాప్‌లోకి రానీయకుండా అమానుషంగా ప్రవర్తించారు. ఈ ఘటన జిల్లాలోని జగదేవ్ పూర్ మండలం తిమ్మాపూర్‌లో చోటు చేసుకుంది. గత కొన్నాళ్లుగా కులవివక్షతో హెయిర్ సెలూన్‌లలో దళితులకు కటింగ్ చేసేందుకు నాయీబ్రాహ్మణుల నిరాకరిస్తున్నారు. వేరే కులస్తులకు మాత్రమే షాపులో చేస్తామని మీకు చెట్టు కింద చేస్తామని నాయి బ్రాహ్మణులు చెప్పారు. గ్రామ పెద్దలు ఒప్పుకుంటే మీకు కూడా షాపులలో అనుమతిస్తామని వారు తెలిపారు. దీంతో చేసేదేమీలేక చెట్ల కిందే దళితులు క్షవరం చేయించుకుంటున్నారు. షాపుకి వెళ్లి తమకెందుకు షాపులో కటింగ్ చేయరని ప్రశ్నిస్తే గ్రామ పెద్దలు ఒప్పుకోవడం నాయి బ్రాహ్మణులు చెబుతున్నారు. దీంతో ఈ విషయంపై దళిత కుటుంబాలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దళితుల పట్ల గ్రామ పెద్దలు వివక్ష చూపడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - 2023-07-06T11:30:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising