ED: మల్లారెడ్డి కాలేజీల్లో ఈడీ సోదాలు.. రూ. కోట్లల్లో నగదు స్వాధీనం
ABN, First Publish Date - 2023-06-22T21:08:17+05:30
తెలంగాణ మెడికల్ కాలేజీల్లో (medical colleges) ఈడీ సోదాలు(ED Raids End) ముగిశాయి. మొత్తం 12 మెడికల్ కాలేజీల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
హైదరాబాద్: తెలంగాణ మెడికల్ కాలేజీల్లో (medical colleges) ఈడీ సోదాలు(ED Raids End) ముగిశాయి. మొత్తం 12 మెడికల్ కాలేజీల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో రూ.1.40 కోట్ల నగదుతో పాటు బ్యాంకు ఖాతాలో రూ.2.89 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్‌తో పాటు 16 ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేసింది. సంబంధిత వ్యక్తుల కార్యాలయాల్లోనూ ఈడీ తనిఖీలు చేపట్టింది. మనీలాండరింగ్ కేసు నమోదు చేసి ఈడీ దర్యాప్తు చేపట్టింది. కీలక డాక్యుమెంట్లు, పెన్‌డ్రైవ్‌లు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా 20 ప్రాంతాల్లో ఈడీ సోదాలు (ED Raids) చేసింది. పీజీ మెడికల్ సీట్లు అక్రమంగా బ్లాక్ చేశారన్న అభియోగంపై ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. కాళోజీ యూనివర్సిటీ ఫిర్యాదు మేరకు గతేడాది ఏప్రిల్‌లో వరంగల్‌లో కేసు నమోదు అయ్యింది. వరంగల్ పోలీసుల కేసు ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ దర్యాప్తు చేస్తోంది. రాష్ట్రంలో 10 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు 45 సీట్లు బ్లాక్ చేసి తర్వాత అమ్ముకున్నారని అభియోగాలు నమోదు అయ్యాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని తొమ్మిది ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. 20 ప్రత్యేక బృందాలతో మేడ్చల్, మహబూబ్ నగర్, కరీంనగర్, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డిలలో ఈడీ సోదాలు చేపట్టింది.
Updated Date - 2023-06-22T21:11:51+05:30 IST