ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణ నాణ్యతపై కేంద్రం బృందం విచారణ

ABN, First Publish Date - 2023-10-25T12:56:40+05:30

మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణ నాణ్యతపై కేంద్ర బృందం విచారణ నిర్వహించింది. క్షేత్ర స్థాయిలో పనుల పరిశీలన కోసం నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ అధికారులు రంగంలోకి దిగారు. గత రెండు రోజులుగా రాష్ట్రంలో కేంద్ర అధికారుల బృందం పర్యటిస్తోంది.

హైదరాబాద్ : మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణ నాణ్యతపై కేంద్ర బృందం విచారణ నిర్వహించింది. క్షేత్ర స్థాయిలో పనుల పరిశీలన కోసం నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ అధికారులు రంగంలోకి దిగారు. గత రెండు రోజులుగా రాష్ట్రంలో కేంద్ర అధికారుల బృందం పర్యటిస్తోంది. మేడిగడ్డలో కుంగిన పిల్లర్స్ ను నేషనల్ డ్యాం సేఫ్టీ అధికారులు పరిశీలించారు. మరికాసేపట్లో హైదరాబాద్ జల సౌధాలో రాష్ట్ర ఇరిగేషన్ శాఖ అధికారులతో నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ అధికారులు కీలక సమావేశం నిర్వహించనున్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో భేటీ జరగనుంది. జలసౌధలో రాష్ట్ర ఇరిగేషన్ అధికారులతో భేటీ కానున్నారు. రాష్ట్ర ఇరిగేషన్ అధికారులు, కాళేశ్వరం ప్రాజెక్టు అధికారులతో చర్చ నిర్వహించనున్నారు. సాంకేతిక వివరాలను కేంద్ర బృందం అడిగి తెలుసుకోనుంది. భేటీ తరువాత కేంద్రానికి తమ నివేదికను కేంద్ర బృందం సమర్పించనుంది.

Updated Date - 2023-10-25T12:56:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising