Minister Gangula: హోలీ సంబరాల్లో పాల్గొని చిందేసిన మంత్రి గంగుల కమలాకర్
ABN, First Publish Date - 2023-03-07T18:28:28+05:30
హోలీ వేడుకలను కరీంనగర్ జిల్లాలో ప్రజలు ఉత్సాహంగా జరుపుకున్నారు. కరీంనగర్ పట్టణంలోని తెలంగాణ చౌక వద్ద జరిగిన హోలీ సంబరాల్లో (Holi celebrations) తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalkar) పాల్గొన్నారు.
కరీంనగర్: హోలీ వేడుకలను కరీంనగర్ జిల్లాలో ప్రజలు ఉత్సాహంగా జరుపుకున్నారు. కరీంనగర్ పట్టణంలోని తెలంగాణ చౌక వద్ద జరిగిన హోలీ సంబరాల్లో (Holi celebrations) తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalkar) పాల్గొన్నారు. అనంతరం మంత్రి గంగుల కమలాకర్ స్టెప్పులు వేసి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. తాను సామాన్య పార్టీ కార్యకర్తగా మొదలై ఒక మంత్రిగా చేరేవరకు కరీంనగర్ (Karimnagar) ప్రజలు ఆదరించారని మంత్రి తెలిపారు. ఇప్పటికీ ఇదే అభిమానం తనపై ఉండాలని కోరుతూ మంత్రి గంగుల కమలాకర్ ఓ రెండు స్టెప్పులు వేసి అందర్నీ అలరించారు. ఆ ఫొటోస్ మీకోసం అందిస్తున్నాం.
పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందోత్సహాలతో హోలీ పండుగ జరుపుకుంటున్నారు. మార్కెట్‌లో రంగుల కొనుగోలుదారులతో సందడి నెలకొంది. హైదరాబాద్ ప్రధాన కూడళ్లలో హోలీకి కావాల్సిన రంగుల కొనుగోళ్లతో వ్యాపార సముదా యాలు కిటకిటలాడాయి. చిన్నారులు జాజిరి.. జాజిరి అంటూ ఆడుతూ సందడి చేశారు. రసాయన రంగులు కాకుండ సహజ సిద్ధమైనవే వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. రసాయనిక రంగులు చల్లుకోవడం వల్ల చర్మంపై దురద, దద్దుర్లు ఇతరత్రా చర్మ వ్యాధులు వస్తాయని చెబుతున్నారు. పలు కాలనీల్లో ప్రజలు కామదహనాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా న్విహించారు. ఈ సందర్భంగా బ్రాహ్మణవాడలోని కేశవనాథ స్వామి ఆలయంలో వేంకటేశ్వరస్వామి డోలోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా భజన, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Updated Date - 2023-03-07T18:31:42+05:30 IST