ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Minister Puvvada: మంత్రి పువ్వాడ ఆసక్తికర కామెంట్స్... ఆయన ఏమన్నారంటే...

ABN, First Publish Date - 2023-08-23T11:55:04+05:30

బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులే తన కుటుంబమని, వారి సహకారంతో ఖమ్మంలో హ్యాట్రిక్‌ సాధిస్తానని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి, ఖమ్మం

ఖమ్మం: బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులే తన కుటుంబమని, వారి సహకారంతో ఖమ్మంలో హ్యాట్రిక్‌ సాధిస్తానని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి, ఖమ్మం బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్‌(Puvvada Ajay Kumar) స్పష్టంచేశారు. మంగళవారం ఖమ్మం వీడీవోస్‌ కాలనీలోని తన క్యాంపు కార్యాలయంలో బీఆర్‌ఎస్‌ నగరఅధ్యక్షుడు పగడాల నాగరాజు అధ్యక్షతన జరిగిన పార్టీ ఖమ్మం నియోజకవర్గ స్ఘాయి విస్తృతస్థాయి సమావేశంలో మంత్రి మాట్లాడారు. 17ఏళ్ల క్రితం తన సోదరుడు మరణించాడని, తాను ఒంటరిని అనుకునేవాడినని, ఖమ్మం ప్రజల అభిమానం చూసి తనకు ఇంత పెద్ద కుటుంబం ఉందని అర్థం చేసుకున్నాన్నారు. వారి చలవతోనే తాను కేసీఆర్‌ కేబినెట్‌లో మంత్రిగా ఉన్నానని, తనను అభ్యర్థిగా ప్రకటించే సమయంలోనూ ఆ ఆనందాన్ని పంచుకునేందుకు ఖమ్మంలోనే ఉన్నానన్నారు. ఓ నాయకుడు బీఆర్‌ఎస్‌ నుంచి వెళుతూ.. తనవెంట చాలామంది వస్తారని ప్రగల్బాలు పలికారని, కానీ ఏం చేయలేకపోయారని విమర్శించారు.

2018లో అందరూ ఒకటై తనను ఓడించేందుకు ప్రయత్నించారని, అయినా కార్యకర్తలు, నాయకులు తనకు అండగా నిలవటంతో తాను ఎమ్మెల్యేగా విజయం సాధించానన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో మరో సారి అధికారంలోకి రావడానికి సహకరించాలన్నారు. ఈసారి వందరోజుల సమయం ఉందని, ఎన్నికల ప్రచారానికి కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. ప్రతీ కార్యకర్త 200నుంచి 300 ఓట్లను ప్రభావితం చేయాలన్నారు. విపక్షాల అభ్యర్థిని ప్రకటించేలోపు నియోజకవర్గంలోని ప్రతీ ఇంటిని మూడుసార్లు సందర్శించి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమపథకాలపై ప్రచారం చేయాలని మంత్రి పువ్వాడ సూచించారు. ఈ సమావేశంలో మేయర్‌ పునుకొల్లు నీరజ, ఉపమేయర్‌ ఫాతిమా జోహారా, సుడాచైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, బీఆర్‌ఎస్‌ రఘునాథపాలెం మండల అధ్యక్షుడు వీరూనాయక్‌, జడ్పీటీసీ సభ్యురాలు ప్రియాంక, జిల్లా నాయకులు గుండాల కృష్ణ, కార్పొరేటర్‌ కర్నాటి కృష్ణ, అనుబంధసంఘాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-23T11:57:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising