ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Minister Sabitha : పిల్లల భవిష్యత్‌పై బాధ్యత ఉన్న ఏ పార్టీ ఇలా చేయదు

ABN, First Publish Date - 2023-04-05T11:02:42+05:30

రాష్ట్రాన్ని ప్రశ్నా పతరాల లీకేజీ అంశం పట్టి పీడిస్తోంది. ఏ పరీక్ష జరిగినా పేపర్ లీక్ కామన్‌గా అవుతోంది. తాజాగా దీనిపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. పేపర్‌ లీకేజీలో బాధ్యుల్ని వదిలే ప్రసక్తే లేదని సబిత తేల్చి చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్ : రాష్ట్రాన్ని ప్రశ్నా పతరాల లీకేజీ అంశం పట్టి పీడిస్తోంది. ఏ పరీక్ష జరిగినా పేపర్ లీక్ కామన్‌గా అవుతోంది. తాజాగా దీనిపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. పేపర్‌ లీకేజీలో బాధ్యుల్ని వదిలే ప్రసక్తే లేదని సబిత తేల్చి చెప్పారు. పేపర్‌ లీక్‌ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వాట్సాప్‌‌లో పేపర్‌ సర్క్యూలేట్‌ చేసి గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. రాజకీయ కోణంలోనే కొందరూ ఆలోచిస్తున్నారని సబిత ఆత్రహం వ్యక్తం చేశారు. పరీక్ష ప్రారంభం అయ్యాక పేపర్‌ షేర్‌ చేయడమేంటని ప్రశ్నించారు. పిల్లల భవిష్యత్‌పై బాధ్యత ఉన్న ఏ పార్టీ ఇలా చేయదని పేర్కొన్నారు. ఎగ్జామ్‌ సెంటర్‌లోకి సిబ్బంది కూడా ఫోన్‌ తీసుకుపోవద్దని మంత్రి సబిత స్పష్టం చేశారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను కరీంనగర్‌ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అరెస్టు చేశారు. కరీంనగర్‌ జ్యోతి నగర్‌లోని ఆయన ఇంటి నుంచి తీసుకెళ్లారు. పదో తరగతి పేపర్ లీకేజీ వ్యవహారంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. నిజానికి, వరుసగా రెండో రోజు మంగళవారం కూడా పదో తరగతి హిందీ ప్రశ్న పత్రం పరీక్ష ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే వాట్సా్‌పలో ప్రత్యక్షమైంది. హనుమకొండలో హెచ్‌ఎంటీవీ బ్యూరో మాజీ చీఫ్‌ బూరం ప్రశాంత్‌ ‘బ్రేకింగ్‌ న్యూస్‌’ అంటూ దానిని వైరల్‌ చేశాడు. హిందీ ప్రశ్న పత్రం లీకైందని, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారంటూ బండి సంజయ్‌తోపాటు చాలామందికి దానిని ఫార్వార్డ్‌ చేశాడు. ఈ నేపథ్యంలో, బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య సోషల్‌ మీడియాలో మాటల యుద్ధం నడిచింది. ప్రశాంత్‌కు, సంజయ్‌కు సంబంధం ఉందంటూ బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపించారు. అయితే, మంత్రి ఎర్రబెల్లితోపాటు మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎమ్మెల్యే విజయ్‌ భాస్కర్‌ తదితరులతో ప్రశాంత్‌ దిగిన ఫొటోలను బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి బయట పెట్టారు. ప్రశాంత్‌ బీజేపీ మనిషంటూ ప్రచారం చేస్తున్న బీఆర్‌ఎస్‌ నేతలు ఇప్పుడేం చెబుతారంటూ నిలదీశారు. ఈ నేపథ్యంలోనే సంజయ్‌ను అరెస్టు చేశారేమోనన్న ప్రచారం జరుగుతోంది. కాగా, సంజయ్‌ అరెస్టును గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి ఖండించారు.

Updated Date - 2023-04-05T11:03:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising