ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MLA: రండి చూసుకుందాం.. నాపై పోటీకి ఎవరొచ్చినా సిద్ధమే...

ABN, First Publish Date - 2023-08-13T13:04:10+05:30

వచ్చే ఎన్నికల్లో నా మీద పోటీ చేయడానికి ఎవరు వచ్చినా ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే

స్టేషన్‌ఘన్‌పూర్‌(జనగామ): వచ్చే ఎన్నికల్లో నా మీద పోటీ చేయడానికి ఎవరు వచ్చినా ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే రాజయ్య(MLA Rajaiah) ప్రకటించారు. శనివారం డివిజన్‌ కేంద్రంలోని మా గార్డెన్‌లో ఆయన 205మం ది బీసీ కులవృత్తుల వారికి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.1లక్ష రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలప్పుడు వచ్చిపోయేవారు నాయకులు కారని అన్నారు. చిల్లరమల్లర మాటలు మాట్లాడి నాకే టికెట్‌ అంటే కుదురదన్నారు. ఊపిరి ఉన్నంతవరకు నియోజకవర్గ ప్రజల కోసం పని చేస్తానని అన్నారు. బీసీ కులాలకు సీఎం కేసీఆర్‌ రూ.1లక్ష సాయం అందించి చేయూతను అందిస్తున్నారన్నారు. గతంలో పద్మశాలీలు, ముదిరాజ్‌లు, గీత కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుందని గుర్తు చేశారు. బీసీ చేతి వృత్తుల వారికి నగదు పంపిణీ విషయంలో ఎవరైనా అవినీతికి పాల్పడితే పురుగులు పడి చస్తారని శాపనార్థాలు పెట్టారు.

కార్యక్రమంలో జడ్పీటీసీ మారపాక రవి, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షురాలు చిట్ల జయశ్రీ-ఉపేందర్‌ రెడ్డి, ఆర్డీవో వాసం రామ్మూర్తి, డీఆర్డీవో రాంరెడ్డి, బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారి రవీందర్‌, డాక్టర్‌ సుగుణాకర్‌రాజు, లక్ష్మినారాయణ, ఎంపీపీలు కందుల రేఖ-గట్టయ్య, బొమ్మిశెట్టి సరిత, సుదర్శన్‌, జడ్పీటీసీ బేబి-శ్రీనివాస్‌, మార్కెట్‌ చైర్మన్‌ గుజ్జరి రాజు, బీఆర్‌ఎస్‌ నాయకులు నాగరబోయిన శ్రీరాములు, మాచర్ల గణేష్‌, సర్పంచ్‌ సురే్‌షకుమార్‌, కనకం గణేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-13T13:04:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising