MLA Seethakka : సీడీఎఫ్ నిధులు విడుదల చేయడం లేదంటూ పిటిషన్
ABN, First Publish Date - 2023-09-29T13:43:35+05:30
నియోజకవర్గాల అభివృద్ధి నిధుల మంజూరులో ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఎమ్మెల్యే సీతక్క పిటిషన్ వేశారు. ములుగు నియోజకవర్గానికి సీడీఎఫ్ నిధులు విడుదల చేయడం లేదని సీతక్క పిటిషన్‌లో పేర్కొన్నారు.
హైదరాబాద్ : నియోజకవర్గాల అభివృద్ధి నిధుల మంజూరులో ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఎమ్మెల్యే సీతక్క పిటిషన్ వేశారు. ములుగు నియోజకవర్గానికి సీడీఎఫ్ నిధులు విడుదల చేయడం లేదని సీతక్క పిటిషన్‌లో పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నందున తన నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం లేదన్నారు. సీడీఎఫ్ మంజూరులో జిల్లా మంత్రి ప్రమేయం చట్ట విరుద్ధమని సీతక్క పేర్కొన్నారు. జిల్లా మంత్రి ఆమోదంతో నిధులు మంజూరు చేయాలన్న జీవో 12 కొట్టేయాలన్నారు. వెంటనే నిధులు విడుదలకు ఆదేశించాలని న్యాయవాది కృష్ణ కుమార్ గౌడ్ కోరారు. ఎమ్మెల్యే సీతక్క పిటిషన్ పై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను అక్టోబరు 9కి వాయిదా వేసింది.
Updated Date - 2023-09-29T13:43:35+05:30 IST