ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MLA: ఎమ్మెల్యే రేగా సంచలన కామెంట్స్.. ఐదుకు ఐదు గిఫ్ట్‌గా ఇస్తా..

ABN, First Publish Date - 2023-08-22T11:34:32+05:30

జరగబోయే శాసనసభ ఎన్నికల్లో జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌(BRS) అభ్యర్థులను గెలిపించి గిఫ్ట్‌గా ఇస్తామని, అలాగే

మణుగూరు(భద్రాద్రి కొత్తగూడెం): జరగబోయే శాసనసభ ఎన్నికల్లో జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌(BRS) అభ్యర్థులను గెలిపించి గిఫ్ట్‌గా ఇస్తామని, అలాగే పినపాక టికెట్‌ ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు విప్‌ రేగా కాంతారావు(Rega Kantha Rao) కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం సాయంత్రం మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమ పై ఎంతో నమ్మకంగా సీఎం కేసీఆర్‌(CM KCR) టికెట్‌ ఇచ్చారని ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. అంతే కాకుండా జిల్లాలో ఐదు నియోజకవర్గాలను గెలిపించుకోని సీఎం కేఈఆర్‌కు కానుకగా ఇస్తానని ప్రకటించారు. ఈ రోజు నుంచి ప్రతి నాయకుడు, కార్యకర్త మూడు నెలల పాటు ప్రజల్లోఉంటూ ప్రభుత్వం తరుపున చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను చైతన్య పరిచి. మళ్లీ తిరిగి ముచ్చటగా మూడోసారి గౌరవ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ప్రమాణ స్వీకారం చేసేంత వరకు వెనుతిరిగి చూడకుండా శక్తి వంచన లేకుండా కృషి చేయాలన్నారు. ప్రదానంగా జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో ఓకేసారి అభ్యర్ధులను ప్రకటించారని భద్రాచలం నుంచి డాక్టర్‌ తెల్లం వెంకట్రావ్‌ రెండుసార్లు ఓటమి పాలైనా పార్టీ మారినా కూడా అతని మంచితనాన్ని చేసిన సేవలను గుర్తిస్తూ సీఎం కేసీఆర్‌ డాక్టర్‌ వెంకట్రావ్‌ అభ్యర్ధత్వాన్ని ఖరారు చేయడం పట్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

తమపై పెట్టిన భాద్యతను వందకు వంధ శాతం నెరవేర్చి గెలుపించుకుంటామన్నారు. మూడు నెలల పాటు ప్రజల్లో ఉండాలి అని నాయకులు కార్యకర్తలకు తెలిపారు. కార్యకర్తలకు ఎల్లప్పుడు అండా ఉంటానని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఎవరూ అదేర్య పడాల్సిన అవసరం లేదు,.. అందోళన చెందకుంటా సీఎం కేసీఆర్‌ నిర్ణయాన్ని శిరస్సా వహించాలన్నారు. ప్రజా క్షేత్రంలో ప్రత్యర్ధులను మట్టి కరిపించాలని సూచించారు. రాబోయ్యేది బిఆర్‌ఎస్‌ ప్రభుత్వమే అన్నారు. మిగులు అభివృద్ది పనులు అన్ని పూర్తి అవుతాయాన్నారు. జిల్లాలో ఐదు టికెట్లు ప్రకటించినందుకు భద్రాచలం డాక్టర్‌ తెల్లం వెంకట్రావ్‌, అశ్వారావు పేట వెచ్చా నాగేశ్వరరావు, కోత్తగూడెం వనమా వెంకటేశ్వరరావు, ఇల్లెందు హారిప్రియ, అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి క్షణాన్ని లెక్కపెట్టుకుంటూ భద్రాద్రి రాముని ఆశీసులతో విజయం కొసం పాటు పడాలన్నారు. సమావేశంలో భద్రాచలం అభ్యర్ధి డాక్టర్‌ తెల్లం వెంకట్రావ్‌, స్ధానిక నాయకులు పోశం నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-22T11:34:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising