MLA: ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన మెజారిటీ కూడా చెప్పేశారు.. ఇంతకీ ఎవరు, ఏ నియోజకవర్గం అంటే...
ABN, First Publish Date - 2023-10-27T09:00:42+05:30
సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోను నియోజకవర్గంలో గడపగడపకు తీసుకెళ్లాలని ముషీరాబాద్
ముషీరాబాద్(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోను నియోజకవర్గంలో గడపగడపకు తీసుకెళ్లాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్(Musheerabad MLA Muta Gopal) నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. గురువారం ముషీరాబాద్ నియోజకవర్గం విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం ముషీరాబాద్‌లోని కషీష్ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించారు. ఈ సమావేశానికి ఆ పార్టీ భోలక్‌పూర్ డివిజన్ అధ్యక్షుడు వై.శ్రీనివా్‌సరావు అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించేలా నాయకులు కృషి చేయాలన్నారు. ఎమ్మెల్సీ ప్రభాకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ కార్యాలయం గాంధీభవన్ గేట్లు మూతపడ్డాయన్నారు. వివిధ పార్టీలకు చెందిన మహిళలు బీఆర్‌ఎ్‌సలో చేరారు. కార్యక్రమంలో ముఠా జైసింహ, ఆరు డివిజన్ల బీఆర్‌ఎస్ అధ్యక్షులు శ్రీనివా్‌సరావు, నర్సింగ్‌ప్రసాద్, ఆర్ మోజేస్, రాకే్‌షకుమార్, బల్ల శ్రీనివాస్‌రెడ్డి, వల్లాల శ్యామ్‌యాదవ్, మీడియా సెల్ ఇన్‌చార్జి ముచ్చకుర్తి ప్రభాకర్, రెబ్బరామారావు, షరీఫ్ ఉద్దీన్, శివముదిరాజ్, దీన్‌దయాల్‌రెడ్డి, మాధవ్, శ్యామ్, డా.విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
- సమావేశానికి కార్పొరేటర్లు, సీనియర్లు గైర్హాజర్
రాంనగర్ : ముషీరాబాద్ నియోజకవర్గం బీఆర్‌ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన నియోజకవర్గం జనరల్ బాడీ సమావేశానికి మాజీ కార్పొరేటర్లు, సీనియర్లు గైర్హాజరయ్యారు. ముషీరాబాద్ మాజీ కార్పొరేటర్ ఏడ్ల భాగ్యలక్ష్మి, ఆమె భర్త ఏడ్ల హరిబాబుయాదవ్, మనోహర్‌సింగ్‌తో పాటు పలువురు సీనియర్ నాయకులు, ఉద్యమకారులు పాల్గొనలేదు. అందరూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు.
Updated Date - 2023-10-27T09:00:42+05:30 IST