MLA Vanama: ఎమ్మెల్యే వనమా సవాల్.. కొత్తగూడెంలో బీసీలకు టిక్కెట్ ఇచ్చే దమ్ము కాంగ్రెస్కు ఉందా..?
ABN, First Publish Date - 2023-09-08T13:02:22+05:30
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రానున్న ఎన్నికలు ధన అహంకారులకు, సంక్షేమపథకాల నడుమ జరుగుతున్నాయని చైతన్య వంతమైన
ఇల్లెందు(భద్రాద్రి కొత్తగూడెం): ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రానున్న ఎన్నికలు ధన అహంకారులకు, సంక్షేమపథకాల నడుమ జరుగుతున్నాయని చైతన్య వంతమైన ఉమ్మడి జిల్లా ఓటర్లు సంక్షేమ పథకాలను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ను గెలిపించుకోవాలని మాజీ మంత్రి, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు(Vanama Venkateswara Rao) పిలుపునిచ్చారు. గురువారం ఇల్లెందు పట్టణంలో ఐఎన్‌టీయుసీ నాయకుడు గోచికొండ సత్యనారాయణ నివాసంలో జరిగిన వివాహ వేడుకలకు హజరయ్యారు. వనమా విలేకర్లతో మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు జనరల్ స్థానాలున్నాయని ఒక్క స్ధానమైన బీసీలకు ఇచ్చే దమ్ము ధైర్యం కాంగ్రెకు ఉందా.. అని సవాల్ విసిరారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఏరాష్ట్రంలోను అమలు కావడం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు పర్యాయాలు సర్వేలు నిర్వహించిన పిదపనే సీఎం కేసీఆర్ బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించారని, గ్రామపంచాయతీ వార్డు సభ్యుని స్ధాయి నుండి మంత్రి పదవి దాక పనిచేసిన తాను మరో పర్యాయం ఘనవిజయం సాధిస్తానని దీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్కు కొత్తగూడెంలో బీసీలకు ఇచ్చె సత్తా ఉందా అని నిలదీశారు. గతంలో పాలించిన కాంగ్రెస్ ఏ సంక్షేమ పధకాలు అమలు చేసిందో చెప్పాలని రానున్న ఎన్నికల్లో కెసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను కాపాడుకునేందుకు అన్ని వర్గాల ప్రజలు ఐక్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీమహిళ విభాగం కార్యదర్శి గోచికొండశ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-09-08T13:07:47+05:30 IST