నల్లగొండ జిల్లాలో ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారు: రేవంత్‌రెడ్డి
ABN, First Publish Date - 2023-04-28T22:09:53+05:30
నల్లగొండ జిల్లా (Nalgonda district)లో ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) దుయ్యబట్టారు.
నల్లగొండ: నల్లగొండ జిల్లా (Nalgonda district)లో ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) దుయ్యబట్టారు. మాజీమంత్రి జానారెడ్డి లాంటి పెద్దలను ఓడించారని తెలిపారు. సీఎం కేసీఆర్ మందులోకి సోడా పోసే వాడిని గెలిపించారని, ఇది నల్లగొండ జిల్లాకు గౌరవమా..? అని ప్రశ్నించారు. దళితబంధు నిధుల్లో అక్రమాలు జరుగుతున్నాయని సీఎం అన్నారని, నిధులు కొల్లగొడుతున్న సొంత ఎమ్మెల్యేల చిట్టా ఉందని అన్నారని తెలిపారు. 30 శాతం నిధులు కొల్లగొడుతుంటే చూస్తూ ఊరుకుందామా? అని ప్రశ్నించారు. నల్లగొండ జిల్లాలో బీఆర్‌ఎస్ (BRS) నేతలు కబ్జాలకు పాల్పడుతున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
నల్లగొండ జిల్లాకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తప్పుబట్టారు. ఉమ్మడి నల్లగొండలో కేసీఆర్ ప్రభుత్వం ఒక్క ప్రాజెక్ట్ కూడా కట్టలేదని దుయ్యబట్టారు. పేపర్స్ లీకేజీలతో నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాటారన్నారు. పలు యూనివర్సిటీల్లో ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ఓట్లు అడిగే హక్కు కేసీఆర్‌కు లేదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తేల్చిచెప్పారు.
Updated Date - 2023-04-28T22:09:53+05:30 IST