MP Bandi Sanjay: సీఎం కేసీఆర్‌పై ఎంపీ బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-08-27T18:27:13+05:30
ఖమ్మం వేదికగా జరిగిన "రైతు ఘోష - బీజేపీ భరోసా" బహిరంగ సభలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ (BJP MP Bandi Sanjay Kumar) మాట్లాడుతూ కేసీఆర్ సర్కారుపై (KCR GOVT) విమర్శలు గుప్పించారు.
ఖమ్మం: ఖమ్మం వేదికగా జరిగిన "రైతు ఘోష - బీజేపీ భరోసా" బహిరంగ సభలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ (BJP MP Bandi Sanjay Kumar) మాట్లాడుతూ కేసీఆర్ సర్కారుపై (KCR GOVT) విమర్శలు గుప్పించారు.
"కేసీఆర్ పేరు దుబాయ్ శేఖర్. దుబాయ్ అని బొంబాయి తీసుకుని పోయిన కేసీఆర్. కోడుకు పేరు అజయ్ రావు...టిక్కెట్ కోసం కేటిఆర్ పేరు పెట్టాడు. ఎన్నికలు వస్తే దళిత బంధు, రుణ మాఫీ గుర్తుకు వస్తుంది. ఒక పెగ్గు వేస్తాడు దళిత బంధు...రెండు పెగ్గులు వేస్తే డబుల్ బెడ్ రూం అంటాడు. మూడు పెగ్గులు వేస్తే రుణ మాఫీ అంటాడు. అని బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి పరులైన వారికి అమిత్ షా చిచ్చరపిడుగు. తెలంగాణ గడ్డలో పౌరిషాన్ని నింపిన ఖమ్మం గడ్డ. తెలంగాణ లో రామరాజ్యం నిర్మిద్దాం." అని బండి సంజయ్ అన్నారు.
Updated Date - 2023-08-27T18:28:32+05:30 IST