MP Kavita: ఎవరికి ఎటువంటి డౌట్ లేదు.. మళ్లీ కేసీఆరే సీఎం
ABN, First Publish Date - 2023-11-11T13:13:44+05:30
అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా నిలిపిన కేసీఆర్ రానున్న ఎన్నికల్లో మూడోసారి ముఖ్యమంత్రి
కురవి(మహబుబాబాద్): అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా నిలిపిన కేసీఆర్ రానున్న ఎన్నికల్లో మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత(Mahbubabad MP Malotu Kavitha) జోస్యం చెప్పారు. కురవిలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈనెల 21వ తేదీన కురవిలో సీఎం కేసీఆర్ సభను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు అధికసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు. గిరిజనులకు ప్రత్యేక గ్రామపంచాతీలను ఏర్పాటు చేసిన కేసీఆర్, ఎంతో మంది గిరిజనులు సర్పంచులు, ప్రజాప్రతినిధులుగా అయ్యేందుకు అవకాశం కల్పించారన్నారు. ఈనెల 11న హైదరాబాద్ శామీర్‌పేటలో రాష్ట్రస్థాయి గిరిజన సదస్సు ఏర్పాటు చేస్తున్నామని, గిరిజనులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. రైతులకు ఉచిత విద్యుత్‌తో పాటు రైతుబీమా, పెట్టుబడి సాయం అందిస్తున్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చాక తెల్లరేషన్‌కార్డు కలిగివున్న 93 లక్షల మందికి ఇన్సురెన్స్ సౌకర్యం కల్పిస్తుందన్నారు.
Updated Date - 2023-11-11T13:13:45+05:30 IST