ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MP Nama: గ్యారెంటీ, వారంటీ లేని కాంగ్రెస్‌ మాటలు నమ్మొద్దు

ABN, First Publish Date - 2023-10-03T14:38:42+05:30

ఎన్నికలు వేళ గ్యారెంటీ, వారంటీ లేని కాంగ్రెస్‌ నాయకుల మాటలు నమ్మొద్దని ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు(Khammam MP Nama Nageswara Rao)

వైరా(ఖమ్మం): ఎన్నికలు వేళ గ్యారెంటీ, వారంటీ లేని కాంగ్రెస్‌ నాయకుల మాటలు నమ్మొద్దని ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు(Khammam MP Nama Nageswara Rao) హెచ్చరించారు. అలాగే వైరాలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మదన్‌లాల్‌ను గెలిపించుకొని జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. వైరాలోని కమ్మవారి కల్యాణమండపంలో సోమవారం బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బాణాల వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఆపార్టీ మునిసిపాలిటీ, మండలస్థాయి కార్యకర్తల సమావేశంలో బీఆర్‌ఎస్‌(BRS) లోక్‌సభ పక్షనేత, వైరా నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ నామ నాగేశ్వరరావు ప్రసంగిం చారు. నాయకులు, కార్యకర్తల మధ్య ఉండే కొద్దిపాటి సమస్యలను తాను చూసుకుంటానని, అందరూ బాధ్యతతో పనిచేసి మదన్‌లాల్‌ గెలుపుకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. రైతుబంధు జిల్లా కన్వీనర్‌ నలమల వెంకటేశ్వరరావు, ఎంపీపీ వేల్పుల పావని, జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, దిశ కమిటీ సభ్యుడు కట్టా కృష్ణార్జున్‌రావు, మునిసిపల్‌ వైస్‌చైర్మన్‌ ముళ్లపాటి సీతరాములు, ఏఎంసీ చైర్మన్‌ పసుపులేటి మోహన్‌రావు, జడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు షేక్‌.లాల్‌మహ్మద్‌, కొత్తా వెంకటేశ్వరరావు, మేడూరి రామారావు, చిత్తారు సింహాద్రియాదవ్‌ పాల్గొన్నారు. ఈ సభలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మదన్‌లాల్‌, సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాములునాయక్‌ ప్రసంగించిన సమయాల్లో పరస్పరం గౌరవించుకుంటూనే మాటలు తూటాలు పేల్చారు. మదన్‌లాల్‌ మాట్లాడుతూ మన పార్టీలో రాములునాయక్‌ నాలుగున్నరేళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ మీరంతా ఎందుకో మన పార్టీలో నిర్వహించిన సర్వేలో ఎమ్మెల్యేగా మదన్‌లాల్‌ కావాలని మీరు చేసిన సూచన మేరకు కేసీఆర్‌ తన పేరును అభ్యర్థిగా ప్రకటించారని వ్యాఖ్యానించారు. 2018 ఎన్నికల్లో కొంతమంది వెన్నుపోటు రాజకీయాలు, లఫూట్‌ నిర్ణయాల వలన నష్టపోయానని పేర్కొన్నారు. ఆతర్వాత ప్రసంగిం చిన ఎమ్మెల్యే రాములునాయక్‌ మదన్‌లాల్‌ వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. 2018లో మదన్‌లాల్‌కు ఎలాంటి అన్యాయం జరగలేదని స్పష్టం చేశారు. ఆఎన్నికల్లో రాజ్యాంగబద్దంగానే తాను గెలిచానని వ్యాఖ్యానించారు. మదన్‌లాల్‌ గెలుపు కోసం చిత్తశుద్దితో పనిచేస్తానని స్పష్టం చేశారు.

Updated Date - 2023-10-03T14:38:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising