MP Nama: ఖమ్మం ఎంపీ నామా సంచలన వ్యాఖ్యలు.. ఆయన ఏమన్నారో తెలిస్తే..
ABN, First Publish Date - 2023-10-08T11:38:00+05:30
ఎన్నికలు సమీపిస్తుండడంతో కాంగ్రెస్, బీజేపీలు దొంగ వైఖరితో ప్రజల ముందుకు వస్తున్నాయని, వాటిని తిరస్కరించి బీఆర్‌ఎస్ కు
జూలూరుపాడు(ఖమ్మం): ఎన్నికలు సమీపిస్తుండడంతో కాంగ్రెస్, బీజేపీలు దొంగ వైఖరితో ప్రజల ముందుకు వస్తున్నాయని, వాటిని తిరస్కరించి బీఆర్‌ఎస్ కు పట్టం కట్టాలని బీఆర్‌ఎస్ లోక్‌సభ పక్షనేత, ఎంపీ నామా నాగేశ్వరరావు(MP Nama Nageswara Rao) ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం జూలూరుపాడులో బీఆర్‌ఎస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్‌కె ఫంక్షన్ హాల్‌లో పార్టీ మండల ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పొన్నెకంటి సతీష్ అధ్యక్షతన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పదేళ్లలో తెలంగాణాలో ఎంతో అభివృద్ది జరిగిందని, తెలంగాణాలో ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ది దేశంలో ఏ రాష్ట్రంలో జరుగలేదన్నారు. కాంగ్రెస్, బీజేపీలు పాలిస్తున్న రాష్ట్రాలలో కూడా తెలంగాణ సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని తెలిపారు. రైతు బిడ్డగా రైతుల సమస్యల గురించి పార్లమెంట్‌లో ఎన్నో సార్లు ప్రస్థావించినట్లు తెలిపారు. బీఆర్‌ఎస్(BRS) ప్రభుత్వం తప్పకుండా అధికారంలోనికి వస్తుందని, సీఎం కేసీఆర్ మూడో సారి ముఖ్యమంత్రి కావడం తధ్యమన్నారు. నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు సమస్యలు వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని, వారికి అండగా ఉంటానని తెలిపారు.
ఎమ్మెల్యే రాములునాయక్ మాట్లాడుతూ కార్యకర్తలు పని చేయడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నారని, ముందుగా నాయకుల మనసులు, మైండ్‌సెట్ మారాలని అన్నారు. నాయకులు ఐక్యంగా పని చేస్తే మంచి ఫలితం సాధించవచ్చు అనే నమ్మకం తనకు ఉందన్నారు. మదన్‌లాల్ విజయం తధ్యమన్నారు. బీఆర్‌ఎస్ వైరా అభ్యర్థి మదన్‌లాల్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎంపీ నామా నాగేశ్వరరావు పని చేసి ఎంతోమంది నాయకులను తీర్చిదిద్దారని అన్నారు. నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా ఎంపీ నామాను నియమించడం అదృష్టమన్నారు. సమావేశంలో రైతు బంధు జిల్లా సమన్వయ సమితి అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వరరావు, బీఆర్‌ఎస్ జిల్లా నాయకులు యల్లంకి సత్యనారాయణ, జడ్పీటీసీ భూక్యా కళావతి, ఎంపీపీ లావుడ్యా సోనీ, ఎంపిటీసీలు కాజా విజయరాణి, పెండ్యాల రాజశేఖర్, సర్పంచ్‌లు రోజా, రాములు, కిషన్‌లాల్, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నున్నా రంగారావు, నాయకులు పిజి.కృష్ణమూర్తి, మూడు చిట్టిబాబు, దుద్దుకూరి నాగేశ్వరరావు, చావా వెంకటరామారావు, సాయిల నాగేశ్వరరావు, రమేష్, మంగముడి నాగేశ్వరరావు, రామారావు, రామకృష్ణ పాల్గొన్నారు.
Updated Date - 2023-10-08T11:38:00+05:30 IST