ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bhupal Reddy: ఆ నేతలిద్దరూ 2 వేల నోటులాగానే అవుతారు

ABN, First Publish Date - 2023-05-25T11:30:49+05:30

తన చివరి రక్తపుబొట్టు వరకూ నల్గొండ అభివృద్ధి కోసం పాటుపడతానని ఎమ్మెల్యే

Bhupal Reddy
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్గొండ: తన చివరి రక్తపుబొట్టు వరకూ నల్గొండ అభివృద్ధి కోసం పాటుపడతానని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తెలిపారు. నల్గొండలో నూతనంగా నిర్మిస్తున్న ఐటీ హబ్ ప్రాంగణంలో భూపాల్ రెడ్డి (Kancharla Bhupal Reddy) మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రులకు చెవిలో చెప్పి ఐటీ హబ్ తెస్తామని చెప్పిన గత పాలకుల మాటలు నీటి మూటలే అయ్యాయని విమర్శించారు. సెప్టెంబర్ నెలలో ఐటీ హబ్.. మరో ఆరు నెలల్లో మెడికల్ కళాశాలను ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. గతంలో అభివృద్ధి లేక నిర్లక్ష్యంగా మారిన నల్గొండపై సీఎం కేసీఆర్ (CM KCR) ప్రత్యేక దృష్టి పెట్టి రూ.1200 కోట్లతో అభివృద్ధికి పూనుకున్నారని వివరించారు. పలు అభివృద్ధి పనుల ప్రారంభానికి జూన్ రెండో వారంలో మంత్రి కేటీఆర్ (KTR) నల్గొండకు రాబోతున్నారని వెల్లడించారు. ఇరవై ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నా అభివృద్ధి చేయకుండా.. ఇప్పుడేమో కళ్లు లేని వారిలా అభివృద్ధి ఎక్కడ జరిగిందని అంటున్నారని దుయ్యాబట్టారు. గత ఎన్నికల్లో లక్ష ఓట్లతో గెలుస్తామన్న నాయకుడిని 25 వేల ఓట్లతో ఓడించారని ఎద్దేవా చేశారు. 50 వేల ఓట్లతో గెలుస్తామన్న ఇద్దరు నేతలు.. రెండు వేల నోటు రద్దు అయినట్టుగానే రద్దవుతారని జోస్యం చెప్పారు. అలాంటి నాయకులు మురిగి పోయిన కోడి గుడ్లు లాంటి వారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2023-05-25T11:30:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising