Telangana Farmers: యూరియా కోసం రైతుల పడిగాపులు
ABN, First Publish Date - 2023-09-08T10:54:20+05:30
జిల్లాలోని హాలియాలో యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. వర్షాలు పడడంతో యూరియాకు డిమాండ్ పెరిగింది. బయట మార్కెట్‌లో, డీలర్ల వద్ద యూరియా లేకపోవడంతో వ్యవసాయ సహకార సంఘాలకు రైతాంగం క్యూ కట్టింది.
నల్గొండ: జిల్లాలోని హాలియాలో యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. వర్షాలు పడడంతో యూరియాకు డిమాండ్ పెరిగింది. బయట మార్కెట్‌లో, డీలర్ల వద్ద యూరియా లేకపోవడంతో వ్యవసాయ సహకార సంఘాలకు రైతాంగం క్యూ కట్టింది. వ్యవసాయ సహకార సంఘాల వద్ద శుక్రవారం ఉదయం నుంచి రైతులు క్యూలైన్లలో నిలబడి పడిగాపులు కాస్తున్నారు. అటు సూర్యాపేట జిల్లా పాలకీడు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. రెండు లారీల యూరియా ఏమైందని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఉదయం నుంచి యూరియా కోసం రైతులు బారులు తీరారు.
Updated Date - 2023-09-08T10:54:20+05:30 IST