ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

JanaReddy: ఎన్నికల బరి నుంచి తప్పుకున్న జానారెడ్డి! నాగార్జునసాగర్ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారంటే..!

ABN, First Publish Date - 2023-08-24T18:17:15+05:30

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, రాజకీయ ఉద్దండుడు జానారెడ్డి (JanaReddy) ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. 2023లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ దరఖాస్తులు స్వీకరిస్తోంది. కానీ జానారెడ్డి అప్లై చేయలేదు. ఆయన స్థానంలో

నల్గొండ: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, రాజకీయ ఉద్దండుడు జానారెడ్డి (JanaReddy) ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. 2023లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ దరఖాస్తులు స్వీకరిస్తోంది. కానీ జానారెడ్డి అప్లై చేయలేదు. ఆయన స్థానంలో నాగార్జుసాగర్ నుంచి జానారెడ్డి చిన్న కుమారుడు జైవీర్‌రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండాలని జానారెడ్డి నిర్ణయం తీసుకోవడంతో ఆయన చిన్న కుమారుడు ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.

ఇదిలా ఉంటే బీఆర్ఎస్ నుంచి తొలి జాబితా ఇప్పటికే విడుదలైంది. 115 మందితో కూడిన ఫస్ట్ లిస్టును ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేశారు. నాగార్జునసాగర్ నుంచి బీఆర్ఎస్ తరపున నోముల భగత్ బరిలోకి దిగుతున్నారు.

మరోవైపు శుక్రవారంతో కాంగ్రెస్ దరఖాస్తుల గడువు ముగుస్తోంది. రేపు చివరి రోజు కావడంతో భారీగా అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉందని గాంధీభవన్ వర్గాలు భావిస్తున్నాయి. రేపు గడువు ముగిసిన తర్వాత దరఖాస్తులను పరిశీలించి సర్వేల అనంతరం అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్ భావిస్తోంది.

Updated Date - 2023-08-24T18:17:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising