Minister Jagadish Reddy: రూ.2వేల నోట్ల రద్దుపై మంత్రి జగదీష్ రెడ్డి రియాక్షన్ ఇదే...
ABN, First Publish Date - 2023-05-20T10:36:24+05:30
రూ.2వేల నోట్లను రద్దు చేస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంపై మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు.
సూర్యాపేట: రూ.2వేల నోట్లను రద్దు చేస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంపై మంత్రి జగదీష్ రెడ్డి (Minister Jagadish Reddy) స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఉపయోగంలేని రూ.2 వేల నోటు ఎందుకు తెచ్చారు... ఎందుకు రద్దు చేస్తున్నారని ప్రశ్నించారు. 2 వేల నోట్ల రద్దు దేశ అభివృద్ధిని అడ్డుకోవడమే అని అన్నారు. పెట్టుబడిదారుల రహస్య అజెండాలో భాగమే రద్దు అని విమర్శించారు. రూ.2 వేల నోట్ల రద్దు చర్య మోడీ ప్రభుత్వ తిరోగమన చర్య అని వ్యాఖ్యలు చేశారు. నోట్ల రద్దు ఎందుకు చేశారో తెలియదని.. ఎంత నల్లధనం వెలికితీశారో తెలియదన్నారు. దేశ పరిపాలన ప్రజల కోసం కాకుండా కొంత మంది వ్యక్తుల కోసమే అని అన్నారు. మోడీ మత విశ్వాసాలు కాకుండా ప్రజలను పేదరికంలో ఉంచాలని ఫ్యూడల్ ఆలోచనలో భాగంగానే నోట్ల రద్దు అని మంత్రి మండిపడ్డారు.
నోట్ల ఉపసంహరణతో లాభం ఉంటే ఎందుకు ప్రచారం చేయడం లేదని ప్రశ్నించారు. రేషన్ దుకాణంలో ఫోటో లేకుంటే గగ్గోలు పెట్టిన ఆర్ధిక మంత్రి ఎందుకు రద్దుపై ప్రచారం చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పతనానికి, రద్దు అంతర్గతంగా దాగి ఉన్న రహస్య ఏజండా ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ (BRS) ప్రభంజనం మొదలైందని.. ఢిల్లీ వరకు ఇదే ప్రభంజనం కొనసాగుతుందని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల వరకు దేశ వ్యాప్తంగా ఇంకా బలోపేతమవుతామని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో తాము లేకపోవడంతోనే కాంగ్రెస్ గెలుపు అని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.
Updated Date - 2023-05-20T10:36:24+05:30 IST