Uttam Kumar Reddy: కాంగ్రెస్ అభ్యర్థులకు పోలీసులు సహకరించట్లేదు
ABN, First Publish Date - 2023-10-17T16:45:11+05:30
కోదాడ అవినీతి మయంగా, గంజాయికి కేంద్ర బిందువుగా మారిందని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (Uttam Kumar Reddy) ఆరోపించారు. కోదాడలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు, నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఇంఛార్జి శశిధర్ రెడ్డిని ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి కాంగ్రెస్ పార్టీలోకి
సూర్యాపేట: కోదాడ అవినీతి మయంగా, గంజాయికి కేంద్ర బిందువుగా మారిందని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (Uttam Kumar Reddy) ఆరోపించారు. కోదాడలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు, నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఇంఛార్జి శశిధర్ రెడ్డిని ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడారు. ‘‘స్థానిక ఎమ్మెల్యే.. నాయకులపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. జాతీయ పార్టీ నుంచి కోదాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పద్మావతికి పోలీసులు బందోబస్తు ఇవ్వడం లేదు. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌కు పోలీసులు ఎందుకు బందోబస్తు ఇస్తున్నారు. త్వరలోనే స్థానిక పోలీసులపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తా.’’ అని ఉత్తమ్ తెలిపారు.
శశిధర్ రెడ్డి కామెంట్స్..
‘‘కేసీఆర్ సారథ్యంలో 2010 నుంచి ఉన్నా.. బీఆర్ఎస్ నుంచి 2014లో పోటీ చేశా. మూడేళ్లుగా ఎమ్మెల్యే వ్యవహారశైలిపై ఎప్పటికప్పుడు అధిష్టానంకు తెలియజేసినా పట్టించుకోలేదు. ఎమ్మెల్యే మీద వ్యతిరేకత వల్లనే పార్టీ మారుతున్నా, పార్టీపై కోపం లేదు.’’ అని శశిధర్‌రెడ్డి వెల్లడించారు.
Updated Date - 2023-10-17T16:45:11+05:30 IST