ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

VHP: యాదగిరిగుట్ట వద్ద ట్రాఫిక్ పోలీసుల వేధింపులు ఆపాలి.. భక్తులను వేధిస్తే ఊరుకోమన్న వీహెచ్‌పీ

ABN, First Publish Date - 2023-06-07T13:48:45+05:30

దేవాలయాల వద్ద ట్రాఫిక్ పోలీసుల వేధింపులు ఆపాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి: దేవాలయాల వద్ద ట్రాఫిక్ పోలీసుల వేధింపులు ఆపాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. ఈరోజు ఉదయం రాచకొండ పోలీస్ కమిషనర్ దేవేందర్ షింగ్ చౌహాన్‌ను విశ్వహిందూ పరిషత్ నేతలు కలిశారు. రాచకొండ కమిషనర్ పరిధిలో గల దేవాలయాల అన్నింటి దగ్గర ట్రాఫిక్ పోలీసుల వేధింపులు మానుకోవాలని వినతి చేశారు. యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాలతో పాటు గుట్టకు వెళ్లే రహదారిలో భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ.. పొల్యూషన్, పెండింగ్ చలాన్లు చెల్లించాల్సిందేనని పోలీసులు హుకుం జారీ చేస్తున్నారని మండిపడ్డారు. "నిరంతరం మేము రోడ్డుపైనే సంచరిస్తుంటాము.. మరో సందర్భంలో కడతాము" అని చెబుతున్నా భక్తులను పోలీసులు కదలనివ్వడం లేదన్నారు. దీంతో దేవాలయాలకు వెళ్లాలంటేనే భక్తులు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని మండిపడ్డారు. ఈ సమస్యపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని రాచకొండ పోలీస్ కమిషనర్‌ దేవేందర్ సింగ్‌ను విశ్వహిందూ పరిషత్ నేతలు కోరారు.

కమిషనర్‌ను కలిసిన అనంతరం వీహెచ్‌పీ నేతలు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో అత్యంత పవిత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులపై చలాన్ల పేరుతో విరుచుకుపడటం ముమ్మాటికి హిందూ ద్రోహమే అని వీహెచ్‌పీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఏ దేవాలయం దగ్గరైనా చలాన్ల పేరుతో వేధింపులకు గురి చేస్తే విశ్వహిందూ పరిషత్ అక్కడికి చేరుకుంటుందని తెలిపారు. రోడ్డుకు ఇరు పక్కన ఎవరికి ఇబ్బంది లేకుండా వాహనాలు నిలిపినా కూడా ఉద్దేశపూర్వకంగా ఫోటోలు తీస్తూ చలాన్ విధిస్తున్నారని మండిపడ్డారు. అలాంటి పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ట్రాఫిక్ చలాన్‌ల పేరుతో భక్తులను వేధిస్తే తగిన రీతిలో జవాబిస్తామని హెచ్చరించారు. హిందూవేతరులు ఫుట్‌పాతులతో మొదలుకొని ప్రధాన రోడ్డులను ఆక్రమించుకొని వ్యాపారాలు చేస్తున్నా కూడా పోలీసులు పట్టించుకోవడంలేదని విమర్శించారు. ట్రాఫిక్ ఇబ్బందులను గురిచేస్తున్న వారిని వెంటనే రోడ్లపై తొలగించాలని డిమాండ్ చేశారు.

విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పండరీనాథ్, సహకార్యదర్శి భానుప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు జగదీశ్వర్, బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు, నాయకులు కిషోర్, చైతన్య తదితరులు కమిషనర్‌ను కలిసినవారిలో ఉన్నారు.

Updated Date - 2023-06-07T13:48:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising