ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Telangana: కాంగ్రెస్‌లో మొదలైన రాజకీయం.. సీఎం అభ్యర్థి ప్రకటన ఆలస్యం

ABN, First Publish Date - 2023-12-04T18:40:15+05:30

తెలంగాణలో నూతన ప్రభుత్వ ఏర్పాటు మరింత ఆలస్యం కానుంది. ఎల్లా హోటల్‌లో జరుగుతున్న సీఎల్పీ సమావేశంలో రేవంత్, భట్టి విక్రమార్క మధ్య గ్రూప్ వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. తాజా పరిణామాల కారణంగా ఈనెల 6న తెలంగాణ నూతన సీఎం ప్రమాణ స్వీకారం జరగనుందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు ఎక్కువగా ఉంటాయనే నానుడి ఉంది. ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో సీఎం పీఠం కోసం యడ్యూరప్ప, డీకే శివకుమార్ మధ్య గ్రూప్ రాజకీయాలు నడిచాయి. ఎన్నికల ఫలితాలు వచ్చిన వారం తర్వాత అక్కడ సీఎం అభ్యర్థి ప్రకటన జరిగింది. ఇప్పుడు ఇదే సీన్ తెలంగాణలోనూ రిపీట్ అవుతోంది. అందరూ రేవంత్‌రెడ్డి సీఎం అని ఫిక్స్ అయిన వేళ.. కాంగ్రెస్‌లో గ్రూప్ రాజకీయాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఎల్లా హోటల్‌లో జరుగుతున్న సీఎల్పీ సమావేశంలో రేవంత్, భట్టి విక్రమార్క మధ్య గ్రూప్ వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు మరింత జాప్యం కానుంది. సీఎం ఎవరో అధిష్టానం ఫిక్స్ చేయాల్సి ఉండటంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి.

మరోవైపు ఏఐసీసీ పెద్దలు పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో బిజీగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈరోజు రాత్రికి ఢిల్లీకి ఏఐసీసీ పరిశీలకులు వెళ్లనున్నారు. బేగంపేట అయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి శివకుమార్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఆయన కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గేతో సమావేశమైన తర్వాత సీఎం పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. తాజా పరిణామాల కారణంగా ఈనెల 6న తెలంగాణ నూతన సీఎం ప్రమాణ స్వీకారం జరగనుందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-12-04T18:40:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising