Kavitha: 119 సీట్లలో 100 పైగా సీట్లు గెలుస్తాం
ABN, First Publish Date - 2023-08-25T14:58:58+05:30
ఆర్మూర్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి ఆశీర్వాద ర్యాలీలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.
నిజామాబాద్: ఆర్మూర్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి
(BRS MLA candidate Jeevan Reddy ఆశీర్వాద ర్యాలీలో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో 119 సీట్లలో 100పైగా సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు కేసీఆర్‌పై (CM KCR) ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీపీసీసీ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) రైతులకు మూడు గంటల కరెంట్ సరిపోతుందని అనడం సిగ్గు చేటన్నారు. రైతులకు మూడు గంటల విద్యుత్ ఇచ్చే కాంగ్రెస్ (Congress) కావాలా, 24 గంటల విద్యుత్ ఇచ్చే కేసీఆర్ కావాలా ఆలోచించుకోవాలన్నారు. కాంగ్రెస్ నాయకులు రైతులకు మూడు గంటల విద్యుత్, బీజేపీ (BJP) నాయకులు మోటర్లకు మీటర్లు పెట్టాలని అంటున్నారని అన్నారు. బీజేపీ ప్రభుత్వం బడాబాబులకు పదిహేను వేల కోట్లు మాఫీ చేసి రైతులకు ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చెయ్యలేదని మండిపడ్డారు. ఎర్రజొన్న బకాయిల కోసం ధర్నా చేసిన రైతులపై కాల్పులు జరిపింది కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు. తమ ప్రభుత్వం వచ్చి ఎర్రజొన్న రైతులకు 13 కోట్లు పంచామని తెలిపారు. రూ.160 కోట్లతో మంచి నీటి ఆర్మూర్ ప్రారంబించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. తమ సీఎం అభ్యర్థి కేసీఆర్ అయితే కాంగ్రెస్, బీజేపీ సీఎం అభ్యర్ధి ఎవరో చెప్పాలని అన్నారు. బీఆర్‌ఎస్ ఆర్మూర్ అభ్యర్ధి జీవన్ రెడ్డి అని.. బీజేపీ, కాంగ్రెస్‌కు అభ్యర్ధి ఎవరు అని ప్రశ్నించారు. జీవన్ రెడ్డిని 60 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. ఈ ర్యాలీలో కవితతో పాటు ఎంపీ సురేష్ రెడ్డి, జెడ్పీ ఛైర్మెన్ విఠల్ రావు, ఆకుల లలిత పాల్గొన్నారు.
Updated Date - 2023-08-25T14:58:58+05:30 IST