Kavitha: చెరువుల పండగతో గ్రామాల్లో పండగ వాతావరణం
ABN, First Publish Date - 2023-06-08T14:57:40+05:30
చెరువుల పండగతో గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. గురువారం ఎడపల్లిలో ఊరూరా చెరువుల పండగ కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు.
నిజామాబాద్: చెరువుల పండగతో గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) అన్నారు. గురువారం ఎడపల్లిలో ఊరూరా చెరువుల పండగ కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ... 60 ఏళ్ల క్రితం వరకు తెలంగాణ పల్లెలు అధ్వాన్నంగా ఉన్నాయన్నారు. స్వరాష్ట్రంలో ప్రగతి అమోఘమన్నారు. ఆంధ్రా పాలకులు నీటి వనరులు కొల్లగొట్టారని విమర్శించారు. రైతుల సంపదతో అన్నిటా సంపద కలుగుతుందన్నారు. రాష్ట్రంలో ఏదోఒక సంక్షేమ పథకం పొందని ఇల్లు లేదని తెలిపారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తన సొంత ఊరిలో ఒక్కరికి కూడా పించన్ ఇవ్వలేదన్నారు. వడ్డించే వాళ్ళు మన వాళ్ళు కాబట్టే సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయని చెప్పారు. ఇళ్ల స్థలాలు ఉన్నవారికి త్వరలో గృహలక్ష్మి పథకం ద్వారా డబ్బులు ఇస్తామన్నారు. గొలుసు కట్టు చెరువులను ప్రాజెక్టు నీళ్లతో నింపుతున్నామన్నారు. కాంగ్రెస్ నాయకులు లొల్లి పెట్టడానికే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లాలో 9 ఏళ్లలో 12 వేల కోట్ల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. తెలంగాణ పథకాలను అన్ని రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయని తెలిపారు. అమృత సరోవర్ పేరుతో కేంద్ర ప్రభుత్వం చెరువుల అభివృద్ధి చేపట్టిందని.. కానీ పది శాతం కూడా నిధులు ఇవ్వలేదని కవిత వ్యాఖ్యలు చేశారు.
Updated Date - 2023-06-08T14:57:57+05:30 IST