ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kavitha: చేసిన అభివృద్ధి చెప్పే సత్తా కేసీఆర్‌కే ఉంది

ABN, First Publish Date - 2023-06-07T13:04:23+05:30

పదేళ్లలో సాధించిన ప్రగతి సమీక్ష కోసమే దశాబ్ది వేడుకలు నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత అన్నారు. బుధవారం తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా సాగు నీటి దినోత్సవంలో ఎమ్మెల్సీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ...చేసిన అభివృద్ధి చెప్పే సత్తా కేసీఆర్‌కే ఉందన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్: పదేళ్లలో సాధించిన ప్రగతి సమీక్ష కోసమే దశాబ్ది వేడుకలు నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) అన్నారు. బుధవారం తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా సాగు నీటి దినోత్సవంలో ఎమ్మెల్సీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ...చేసిన అభివృద్ధి చెప్పే సత్తా కేసీఆర్‌కే (CM KCR) ఉందన్నారు. సమైక్య పాలనలో కరువు ఉండేదని.. నేడు ఎక్కడ చూసినా పచ్చని పైర్లు కనిపిస్తున్నాని తెలిపారు. కాళేశ్వరం భగీరథ ప్రయత్నమే అని చెప్పుకొచ్చారు. కల్వకుంట్ల చంద్ర శేఖర్ అనేకంటే కాలేశ్వరం చంద్ర శేఖర్‌గా పిలవాలన్నారు. కాంగ్రెస్ పాలనలోకాలువలు తవ్వకుండానే వేలకోట్ల దండుకున్నారని ఆరోపించారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ కాళేశ్వరమన్నారు. కేంద్రం జాతీయ హోదా ఇవ్వకపోవడం సిగ్గుచేటని వ్యాఖ్యలు చేశారు. నిధులు ఇవ్వకపోయినా జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నిజమైన నాయకుడని తెలిపారు. మహారాష్ట్రతో ఒప్పందం వల్లే జల వివాదాలు లేవని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.

Updated Date - 2023-06-07T13:06:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising