ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

T.Elections 2023: తెలంగాణ రాజకీయాల్లో సెంటర్ పాయింట్‌గా కామారెడ్డి

ABN, First Publish Date - 2023-10-18T12:02:02+05:30

తెలంగాణ రాజకీయాల్లో కామారెడ్డి సెంటర్ పాయింట్‌గా మారింది. ఇక్కడి నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ బరిలోకి దిగడమే ఇందుకు కారణం. బీబీపీట మండలంలోని కోనాపూర్ కేసీఆర్ అమ్మ వాళ్ళ ఊరు.

కామారెడ్డి: తెలంగాణ రాజకీయాల్లో కామారెడ్డి సెంటర్ పాయింట్‌గా మారింది. ఇక్కడి నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ (CM KCR) బరిలోకి దిగడమే ఇందుకు కారణం. బీబీపీట మండలంలోని కోనాపూర్ కేసీఆర్ అమ్మ వాళ్ళ ఊరు. తల్లిదండ్రులు వెంకటమ్మ - రాఘవరావులు కోనాపూర్ నుంచి చింతమడకకు వలస వెళ్లారు. ప్రస్తుతం కామారెడ్డి తమ నియోజకవర్గమే అని చెప్పుకుంటూ కేసీఆర్ బరిలోకి దిగుతున్నారు. ఇక్కడ మొత్తం ఓటర్లు 2,27,867 కాగా మహిళలు 1,17,783, పురుషులు 1,10,056, ట్రాన్స్ జెండర్లు 28 ఓట్లు ఉన్నాయి. నియోజకవర్గంలో ముదిరాజ్‌ల సంఖ్య ఎక్కువగా ఉంది. సుమారుగా 31,000 మంది ముదిరాజ్‌లు ఉన్నారు. మైనారిటీలు 28,000, మున్నూరు కాపులు 16,000 మంది ఉన్నారు.


కాగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30న జరుగనున్నాయి. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబిత బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఆయా ప్రాంతాల్లో అభ్యర్థులు తమ ప్రచారాన్ని కూడా షురూ చేసేశారు. ఈసారి కేసీఆర్ రెండు చోట్ల బరిలోకి దిగనున్నారు. గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో కూడా కేసీఆర్ పోటీ చేస్తున్నారు. నవంబర్ 30న ఎన్నికలు జరుగనుండగా.. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో హ్యాట్రిక్ ఖాయమని బీఆర్‌ఎస్ అంటుండగా.. అధికారం మాదే అంటూ కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Updated Date - 2023-10-18T12:02:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising