ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

karnataka election results: మత రాజకీయాలను కర్ణాటక ప్రజలు తిప్పికొట్టారు: రేవంత్‌రెడ్డి

ABN, First Publish Date - 2023-05-13T17:40:52+05:30

మత రాజకీయాలను కర్ణాటక (karnataka) ప్రజలు తిప్పికొట్టారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మత రాజకీయాలను కర్ణాటక (karnataka) ప్రజలు తిప్పికొట్టారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని కర్ణాటక ప్రజలు ఓడించారని తెలిపారు. కర్ణాటకలో హంగ్ వచ్చేలా చేసి.. కాంగ్రెస్‌ను అధికారంలోకి రాకుండా చేయాలనుకున్నారని, జేడీఎస్‌ను ఓడించి సీఎం కేసీఆర్ (CM KCR) ఎత్తులను చిత్తుచేశారని పేర్కొన్నారు. కర్ణాటక ఫలితాలు తెలంగాణలో పునరావృతం అవుతాయని రేవంత్ జోస్యం చెప్పారు. ఎర్రకోటపై కూడా కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. భారత్‌ జోడోయాత్ర సత్ఫలితాలు ఇస్తోందని రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు ప్రజా విజయమని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (MP Uttam Kumar Reddy) అభివర్ణించారు. కర్ణాటకలో అవినీతి, మతతత్వ బీజేపీ లాగే.. తెలంగాణలో అవినీతి, నిరంకుశ బీఆర్‌ఎస్ ఓటమి తప్పదని హెచ్చరించారు. తెలంగాణలో సీఎం ఆఫీస్ నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు అవినీతి జరుగుతోందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు.

దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ (Karnataka poll result) ముగిసింది. కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజారిటీ సాధించింది. ఏకంగా 136 నియోజకవర్గాల్లో జయకేతనం ఎగురవేసింది. బీజేపీ 64 స్థానాల్లో గెలుపొందింది. ఇక కింగ్ మేకర్‌గా మారుతుందని అంచనా వేసిన జేడీఎస్ కేవలం 20 స్థానాలకే పరిమితమైంది.

Updated Date - 2023-05-13T17:40:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising