ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Telangana Elections 2023: ఓటు హక్కు వినియోగించుకున్న రాజకీయ ప్రముఖులు

ABN, First Publish Date - 2023-11-30T08:39:41+05:30

Telangana Polls: సత్తుపల్లి పట్టణంలోని బాలికల పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో బీఅర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య ఓటు హక్కును వినియోగించుకున్నారు. జగిత్యాల జిల్లాలోని తన స్వంత గ్రామం అంతర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దంపతులు, మాజీ మంత్రి రాజేశం గౌడ్ ఓటు వేశారు.

Telangana Polls: సత్తుపల్లి పట్టణంలోని బాలికల పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో బీఅర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య ఓటు హక్కును వినియోగించుకున్నారు. జగిత్యాల జిల్లాలోని తన స్వంత గ్రామం అంతర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దంపతులు, మాజీ మంత్రి రాజేశం గౌడ్ ఓటు వేశారు. ఖమ్మం నగరంలోని హార్వెస్ట్ స్కూల్ 250 పోలింగ్ బూత్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

వర్గల్ మండల కేంద్రంలో గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుంకుంట నర్సారెడ్డి కుటుంబ సమేతంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే సూర్యాపేట కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఓటు వేశారు. నల్గొండ జిల్లా అనుముల మండలం ఇబ్రహీంపేట ప్రాథమిక పాఠశాలలో 170 పోలింగ్ బూతులో నాగార్జునసాగర్ బీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో బీజేపీ అభ్యర్థి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ఓటు వినియోగించుకున్నారు. అటు ఎమ్మెల్సీ కవిత కూడా బంజారాహిల్స్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలోని పోలింగ్ స్టేషన్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు తమ ఓటు వినియోగించుకున్నారు. కామారెడ్డి జిల్లా స్వగ్రామం పోచారం గ్రామంలో సతీమణి పుష్పతో కలిసి రాష్ట్ర శాసన సభాపతి, బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాస రెడ్డి తన ఓటు వేశారు. యాఖత్ పురా బీఆర్ఎస్ అభ్యర్థి సామ సుందర్ రెడ్డి దంపతులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చెన్నూర్ బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ దంపతులు ఓటు వేశారు. ఎల్‌బీ నగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తన కుటుంభ సభ్యులతో కలిసి బి.ఎన్.రెడ్డి.నగర్ డివిజన్ పరిధిలోని మారుతి నగర్‌లోని ఎస్.ఎస్.ఎస్.విద్యా నికేతన్ స్కూల్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారి వెంట సుధీర్ రెడ్డి సతీమణి కమల సుధీర్ రెడ్డి, వారి కుమారులు ప్రీతమ్ రెడ్డి, గౌతమ్ రెడ్డి ఉన్నారు.

Updated Date - 2023-11-30T09:02:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising