ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ponguleti: నో డౌట్.. రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే..

ABN, First Publish Date - 2023-08-23T12:52:36+05:30

రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని ఆ పార్టీ ప్రచార కమిటీ కో చైర్మన్‌ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Ponguleti Srinivas Reddy) తెలిపారు.

కొణిజర్ల(ఖమ్మం): రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని ఆ పార్టీ ప్రచార కమిటీ కో చైర్మన్‌ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Ponguleti Srinivas Reddy) తెలిపారు. మంగళవారం పొంగులేటి మండలంలోని సిద్ధిక్‌ నగర్‌, పల్లిపాడు, పెద్దమునగాలలో పర్యటించారు. సిద్ధిక్‌ నగర్‌లో కాంగ్రెస్‌ శ్రేణులు బైక్‌ ర్యాలీ, డప్పువాయిద్యాలు, కోలాటంతో స్వాగతం పలికారు. సిద్ధిక్‌నగర్‌లో అంబేద్కర్‌, మాజీ సర్పంచ్‌ బాగం రఘునాథరావు విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే రైతులకు రెండు లక్షల రుణ మాఫీ, పింఛన్‌ రూ 4వేలు, నిరుద్యోగుల యువతకు రెండు లక్షల ఉద్యోగాలను మొదటి సంవత్సరంలోనే అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ వైరా నియోజకవర్గ నాయకురాలు బానోతు విజయాబాయి, రాష్ట్రమార్క్‌ఫెడ్‌ మాజీ వైస్‌చైర్మన్‌ బొర్రా రాజశేఖర్‌, వైరా మునిసిపల్‌ చైర్మన్‌ సూతగాని జైపాల్‌, ఎల్‌ఎండీ కన్వీనర్‌ సూరంపల్లి రామారావు, ఆత్మకమిటీ చైర్మన్‌ కోసూరి శ్రీనివాసరావు, ఎంపీపీ గోసు మధు, సర్పంచ్‌ జ్యోతి, సువార్త, ఎదునూరి శ్రీను, కృష్ణారావు, రాంపుడి రోశయ్య పాల్గొన్నారు.

- ఇంటికి వచ్చినప్పుడల్లా అమ్మ అప్యాయంగా పలకరిం చేదని, ఆ తల్లి మరణం మరువ లేమని కాంగ్రెస్‌ రాష్ట్ర వర్కింగ్‌కమిటీ కో చైర్మన్‌ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. పెద్దము నగాల సర్పంచ్‌ పరికపల్లి శ్రీను తల్లి వెంకటలక్ష్మీ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. మరణవార్త తెలుసుకున్న పొంగులేటి మంగళవారం పెద్దమునగాలకు వెళ్లి శ్రీను పరామర్శించి అతని తల్లి చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పొంగులేటి వర్గీయులు, కాంగ్రెస్‌ నియోజకవర్గ నాయ కురాలు బానోతు విజయాబాయి, బొర్రా రాజశేఖర్‌, కోసూరి శ్రీను, ఎంపీపీ గోసు మధు, రాంపుడి రోశయ్య, రాయల పుల్లయ్య, రాంబాబు, నరేంద్రనాయుడు, కోటి, కావూరి శ్రీను, మోషా, రావు, రామకోటయ్య, సోలా శ్రీను, ఎల్లయ్య, రంజిత్‌, కిషోర, పలువురు కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-23T12:52:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising